Ani vemkadeshum daade nalamelumamgadoda

అని వేంకటేశుఁ డాడె నలమేలుమంగతోడ
Language

(॥పల్లవి॥)
అని వేంకటేశుఁ డాడె నలమేలుమంగతోడ
వినరే వో చెలులా వేమారు నీరీతుల

(॥అని॥)
తప్పక చూచితే నేమే తరగీనా నీ పంతము
కప్పనేలే నీ చన్నులు గరివడీనా
చెప్పవే నీపేరు మోవి చిల్లులువో నింతలోనే
యిప్పడు నన్నింతసేసి యేమిగట్టుకొనేవే

(॥అని॥)
వద్దఁ గూచుండితే నేమే వాసి ముక్కవోయీనా
గద్డించే వింతలోఁ గండ గట్టుకొంటివా
పొద్దువోదు నవ్వఁగదే పోదు నీ బీరమెంతైనా
యిద్దెస నన్నింతసేసి యేమి గట్టుకొనేవే

(॥అని॥)
సేవలు సేసితే నేమే సిగ్గులు నీకు ముంచీనా
దేవులవైతివి వావి తిరమాయను
నీ వలమేలుమంగవు నేను శ్రీవేంకటేశుఁడ
యీవల నన్నింతసేసి యేమి గట్టుకొనేవే

(||pallavi||)
ani veṁkaḍeśhum̐ ḍāḍĕ nalamelumaṁgadoḍa
vinare vo sĕlulā vemāru nīrīdula

(||ani||)
tappaga sūside neme taragīnā nī paṁtamu
kappanele nī sannulu garivaḍīnā
sĕppave nīberu movi silluluvo niṁtalone
yippaḍu nanniṁtasesi yemigaṭṭugŏneve

(||ani||)
vaddam̐ gūsuṁḍide neme vāsi mukkavoyīnā
gadḍiṁche viṁtalom̐ gaṁḍa gaṭṭugŏṁṭivā
pŏdduvodu navvam̐gade podu nī bīramĕṁtainā
yiddĕsa nanniṁtasesi yemi gaṭṭugŏneve

(||ani||)
sevalu seside neme siggulu nīgu muṁchīnā
devulavaidivi vāvi tiramāyanu
nī valamelumaṁgavu nenu śhrīveṁkaḍeśhum̐ḍa
yīvala nanniṁtasesi yemi gaṭṭugŏneve