(॥పల్లవి॥)
అనేక పంతగాఁడవు అందగాఁడవు
మునుకొన్న మా వెంగేలు ముంచుకొనీనా
(॥॥)
కొసరితే నేమాయ కొంగువట్టితే నేమాయ
మసలక తగులైన మగవానిని
యెసఁగ నేఁ జెనకితే నేలతప్పించుకొనేవు
కసుఁగందనిచన్నులు కాఁడీనా నిన్నును
(॥॥)
సారె నంటించితే నేమాయ జంకించితే నేమాయ
వేరులేని చుట్టరికమైన విటరాయని
వూరక నవ్వితేను వొడ్డించుకో నీకేఁటికి
ఆరితేరి నాచూపులు ఆయములు రేఁచీనా
(॥॥)
చెక్కు నొక్కితే నేమాయ చిక్కించుకొంటే నేమాయ
అక్కరతో నాయకుఁడైనవానిని
యిక్కడ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
మిక్కిలి నారతులివి మేరమీరీనా
(||pallavi||)
anega paṁtagām̐ḍavu aṁdagām̐ḍavu
munugŏnna mā vĕṁgelu muṁchugŏnīnā
(||||)
kŏsaride nemāya kŏṁguvaṭṭide nemāya
masalaga tagulaina magavānini
yĕsam̐ga nem̐ jĕnagide neladappiṁchugŏnevu
kasum̐gaṁdanisannulu kām̐ḍīnā ninnunu
(||||)
sārĕ naṁṭiṁchide nemāya jaṁkiṁchide nemāya
veruleni suṭṭarigamaina viḍarāyani
vūraga navvidenu vŏḍḍiṁchugo nīgem̐ṭigi
ārideri nāsūbulu āyamulu rem̐sīnā
(||||)
sĕkku nŏkkide nemāya sikkiṁchugŏṁṭe nemāya
akkarado nāyagum̐ḍainavānini
yikkaḍa śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
mikkili nāradulivi meramīrīnā