Anavalasina maamta amtimigaaga

అనవలసిన మాఁట అంటిమిగాక
Language

(॥పల్లవి॥)
అనవలసిన మాఁట అంటిమిగాక
గునిసి యప్పటి నేల కొసరేము

(॥అన॥)
వలపు నీవు చల్లఁగ వచ్చివచ్చి వేఁడుకోఁగా
చలము నీతోనేల సాదించేము
తలుపు నీవు ముయ్యఁగ దండనుండి చెనకఁగ
పెలుచుఁదనాననేల పెనఁగేము

(॥అన॥)
సరసము నీవాడఁగ చల్లనిచూపు చూడఁగ
గొరుబుసేసి నిన్నేల కోపగించేము
సొరిది నీవు నవ్వఁగా చుట్టరికాలు చెప్పఁగా
విరసాన నిన్ను నేల వెంగెమాడేము

(॥అన॥)
కందున మో వియ్యఁగాను కాఁగిలించి కూడఁగాను
నింద నీపై వేసి యేల నేరమెంచేము
యిందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
కిందటిచేతలెల్లా కెరలించేమా

(||pallavi||)
anavalasina mām̐ṭa aṁṭimigāga
gunisi yappaḍi nela kŏsaremu

(||ana||)
valabu nīvu sallam̐ga vachchivachchi vem̐ḍugom̐gā
salamu nīdonela sādiṁchemu
talubu nīvu muyyam̐ga daṁḍanuṁḍi sĕnagam̐ga
pĕlusum̐danānanela pĕnam̐gemu

(||ana||)
sarasamu nīvāḍam̐ga sallanisūbu sūḍam̐ga
gŏrubusesi ninnela kobagiṁchemu
sŏridi nīvu navvam̐gā suṭṭarigālu sĕppam̐gā
virasāna ninnu nela vĕṁgĕmāḍemu

(||ana||)
kaṁduna mo viyyam̐gānu kām̐giliṁchi kūḍam̐gānu
niṁda nībai vesi yela neramĕṁchemu
yiṁdarilo śhrīveṁkaḍeśha nannu nelidivi
kiṁdaḍisedalĕllā kĕraliṁchemā