Anare yitte yenasi dosa manare sella danare mee raadanido nemdu

అనరే యిట్టే యెనసి దోస మనరే చెల్ల దనరే మీ రాతనితో నేఁడు
Language

(॥పల్లవి॥)
అనరే యిట్టే యెనసి దోస మనరే చెల్ల దనరే మీ రాతనితో నేఁడు - నా
మనసెల్లఁ దనవెంట వెంటనే మరపె నే నెట్టు మఱతునే

(॥అనరే॥)
యేల రాఁడే రమణుఁడు తన కేమి సేసితినే
వేళతోఁ దా నిన్నా ళ్లింతకు విచ్చేసుఁ దా నీడకు
మేలునా యది వలచినవారి మేకులఁ బెట్టేది
నాలికాఁడు నాచన్నులు కొనగోర నాఁటించె నే నింక నేమిసేతునే

(॥అనరే॥)
నాఁడు నాఁడే యీ సుద్ది చెప్పిన నాయంత నే నుందును
వేఁడివేఁడి కాఁకలు రేఁచి వెతలు సేయింతురా
ఆఁడుదాననై మూల నుండితే నాసలెల్లా మానునా
నేఁడు తనమోవి యిచ్చి కత లెల్ల నేరిపె నే నెట్టు విడుతునే

(॥అనరే॥)
చాలదా యింతతడవు నాతో సరసము దనకు
ఆలించి యాడఁ బొంచు వినీనో అంత మాయకాఁడు
తాళ మంటి నట్టు శ్రీవేంకటేశుఁడు దగ్గరి నన్నుగూడెను
యేలో నాకు నవ్వులివే ముంచుకొనె నేడ నుంటి వని యడుగరే

(||pallavi||)
anare yiṭṭe yĕnasi dosa manare sĕlla danare mī rādanido nem̐ḍu - nā
manasĕllam̐ danavĕṁṭa vĕṁṭane marabĕ ne nĕṭṭu maṟadune

(||anare||)
yela rām̐ḍe ramaṇum̐ḍu tana kemi sesidine
veḽadom̐ dā ninnā ḽliṁtagu vichchesum̐ dā nīḍagu
melunā yadi valasinavāri megulam̐ bĕṭṭedi
nāligām̐ḍu nāsannulu kŏnagora nām̐ṭiṁchĕ ne niṁka nemisedune

(||anare||)
nām̐ḍu nām̐ḍe yī suddi sĕppina nāyaṁta ne nuṁdunu
vem̐ḍivem̐ḍi kām̐kalu rem̐si vĕdalu seyiṁturā
ām̐ḍudānanai mūla nuṁḍide nāsalĕllā mānunā
nem̐ḍu tanamovi yichchi kada lĕlla neribĕ ne nĕṭṭu viḍudune

(||anare||)
sāladā yiṁtadaḍavu nādo sarasamu danagu
āliṁchi yāḍam̐ bŏṁchu vinīno aṁta māyagām̐ḍu
tāḽa maṁṭi naṭṭu śhrīveṁkaḍeśhum̐ḍu daggari nannugūḍĕnu
yelo nāgu navvulive muṁchugŏnĕ neḍa nuṁṭi vani yaḍugare