అనరే యీ మాఁటే మీరు ఆతనితోను
(॥పల్లవి॥)
అనరే యీ మాఁటే మీరు ఆతనితోను
ననుపు చూపితే నవ్వు నాలిఁబడదా
(॥అన॥)
తననగరిలో నుంటే తనకే సెలవుగాదా
చెనకి పైకొని గాసిసేయవలెనా
మనసుగలిగితేనే మన్నించీఁగాక తానె
పెనఁగఁబోతే వలపు పిప్పి గట్టదా
(॥అన॥)
కొలువవారిలో నుంటే కోరి తన సొమ్మఁగానా
మొలకచన్నులు సారె మోపవలెనా
వలసినప్పుడు తానే వచ్చీఁగాక యిట్టె
చలపట్టితే రతులు చప్పగాదా
(॥అన॥)
అండ బానుపుపై నుంటే ఆలఁ దనకేకాదా
బండుగాఁ గాఁగిట మెదుపఁగవలెనా
నిండు కలమేలుమంగ నేను శ్రీవేంకటేశుఁడు
దండిగాఁ దా నన్నుఁ గూడె తప్పే వొప్పుగాదా
(||pallavi||)
anare yī mām̐ṭe mīru ādanidonu
nanubu sūbide navvu nālim̐baḍadā
(||ana||)
tananagarilo nuṁṭe tanage sĕlavugādā
sĕnagi paigŏni gāsiseyavalĕnā
manasugaligidene manniṁchīm̐gāga tānĕ
pĕnam̐gam̐bode valabu pippi gaṭṭadā
(||ana||)
kŏluvavārilo nuṁṭe kori tana sŏmmam̐gānā
mŏlagasannulu sārĕ mobavalĕnā
valasinappuḍu tāne vachchīm̐gāga yiṭṭĕ
salabaṭṭide radulu sappagādā
(||ana||)
aṁḍa bānububai nuṁṭe ālam̐ danagegādā
baṁḍugām̐ gām̐giḍa mĕdubam̐gavalĕnā
niṁḍu kalamelumaṁga nenu śhrīveṁkaḍeśhum̐ḍu
daṁḍigām̐ dā nannum̐ gūḍĕ tappe vŏppugādā