Anaraadu gaaga ninnu aayamulu soobi mobi

అనరాదు గాక నిన్ను ఆయములు చూపి మోపి
Language

(॥పల్లవి॥)
అనరాదు గాక నిన్ను ఆయములు చూపి మోపి
ఘనుఁడవైతే పాపము కలపేవా నీవు

(॥అన॥)
శిరసు వంచుకుందాన సిగ్గువడివున్నదాన
కరఁగుచు నాపై నేల కాలు వేసేవు
సరుగన నెఁతైనా మజ్జన మవధరించవు
దొరవైతే నేసినట్టిదోసములు వాసునా

(॥అన॥)
కలయక వున్నదాన కడనిట్టే వున్నదాన
యెలమిఁ దమ్ములము నాకేల పెట్టేవు
కలవి మోవి యెంగిలి కడుగకో వెఁతైనా
యిలయేలేవాఁడవైతే నెంగిలి లేదా

(॥అన॥)
అంటఁగాక వున్నదాన ఆనవెట్టుచున్నదాన
జంటగాఁ గాఁగిటఁ బట్టి సారెఁ గూడేవు
నంటున శ్రీవేంకటేశ నామతక మెఱఁగవు
దంటవయసువాఁడవైతే తప్పొప్పు లేదా

(||pallavi||)
anarādu gāga ninnu āyamulu sūbi mobi
ghanum̐ḍavaide pābamu kalabevā nīvu

(||ana||)
śhirasu vaṁchuguṁdāna sigguvaḍivunnadāna
karam̐gusu nābai nela kālu vesevu
sarugana nĕm̐tainā majjana mavadhariṁchavu
dŏravaide nesinaṭṭidosamulu vāsunā

(||ana||)
kalayaga vunnadāna kaḍaniṭṭe vunnadāna
yĕlamim̐ dammulamu nāgela pĕṭṭevu
kalavi movi yĕṁgili kaḍugago vĕm̐tainā
yilayelevām̐ḍavaide nĕṁgili ledā

(||ana||)
aṁṭam̐gāga vunnadāna ānavĕṭṭusunnadāna
jaṁṭagām̐ gām̐giḍam̐ baṭṭi sārĕm̐ gūḍevu
naṁṭuna śhrīveṁkaḍeśha nāmadaga mĕṟam̐gavu
daṁṭavayasuvām̐ḍavaide tappŏppu ledā