Anamtaabaraadhi nenu adugaana sharanamtini

అనంతాపరాధి నేను అటుగాన శరణంటిని
Language

(॥పల్లవి॥)
అనంతాపరాధి నేను అటుగాన శరణంటిని
యెనలేని నీ గుణాలు యేమిచూచేనయ్యా

(॥అనం॥)
దగ్గరి కొలుతు నాతరతమ్య మెంచుకోను
సిగ్గువడ నిట్టే నిన్నుఁ జేరి పాడుదు
వొగ్గి విన్నపాలు సేతు వుబ్బునఁ జిత్త మెరఁగ
యెగ్గు లెంచితే నావల్ల నెన్ని లేవయ్యా

(॥అనం॥)
పాదాలంటి మొక్కుదును పరిశుద్ధి దలఁచను
సాదించి కొలువవత్తు సత్వ చూడను
యేదేసనైననా నుతింతు యెంగిలినోరని మాన
పాదుగా విచారించితే బలుమూఢుఁడనయ్యా

(॥అనం॥)
మంచముపైఁ దలపోతు మందెమేళమనియన
కంచముకూడర్పింతుఁ గాదననేర
యెంచఁగ శ్రీవేంకటేశ యిన్నిటా నీబంట నైతి
పంచలఁ జూచితే నీపాలివాఁడనయ్యా

(||pallavi||)
anaṁtābarādhi nenu aḍugāna śharaṇaṁṭini
yĕnaleni nī guṇālu yemisūsenayyā

(||anaṁ||)
daggari kŏludu nādaradamya mĕṁchugonu
sigguvaḍa niṭṭe ninnum̐ jeri pāḍudu
vŏggi vinnabālu sedu vubbunam̐ jitta mĕram̐ga
yĕggu lĕṁchide nāvalla nĕnni levayyā

(||anaṁ||)
pādālaṁṭi mŏkkudunu pariśhuddhi dalam̐sanu
sādiṁchi kŏluvavattu satva sūḍanu
yedesanainanā nudiṁtu yĕṁgilinorani māna
pādugā visāriṁchide balumūḍhum̐ḍanayyā

(||anaṁ||)
maṁchamubaim̐ dalabodu maṁdĕmeḽamaniyana
kaṁchamugūḍarbiṁtum̐ gādananera
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yinniḍā nībaṁṭa naidi
paṁchalam̐ jūside nībālivām̐ḍanayyā