అనకువే నీవకు నన్ను అవుఁగాదనుచు నేఁడు
(॥పల్లవి॥)
అనకువే నీవకు నన్ను అవుఁగాదనుచు నేఁడు
కనుగిరుపుల సేఁత కంటివటే నీవు
(॥అన॥)
తియ్యని మాఁటలలోనే తెరమరఁగులు చేసీ
వొయ్యనే వినవే నీవు వోచెలియ
వెయ్యింటి కొకటి నేను విచ్చిచెప్పఁబోతేను
కయ్యములకుఁ దిరిగీ కంటివటే నీవు
(॥అన॥)
సెలవినవ్వులలోనే చెనకులు వెదచల్లీ
తలఁచుకుండవే యిది తరుణి నీవు
చలివాపి నేనిది సాఁకిరివెట్టఁగఁబోతే
కలపీఁ దన పంతాలు కంటివటే నీవు
(॥అన॥)
కందువ సిగ్గులలోనే కాఁగిటను నన్నుఁ గూడె
అందియ్యఁ గదవే విడె మతివ నీవు
విందులమో విచ్చితి శ్రీ వేంకటేశుఁ డితనికి
గందము వూసీ నిదె కంటివటె నీవు
(||pallavi||)
anaguve nīvagu nannu avum̐gādanusu nem̐ḍu
kanugirubula sem̐ta kaṁṭivaḍe nīvu
(||ana||)
tiyyani mām̐ṭalalone tĕramaram̐gulu sesī
vŏyyane vinave nīvu vosĕliya
vĕyyiṁṭi kŏgaḍi nenu vichchisĕppam̐bodenu
kayyamulagum̐ dirigī kaṁṭivaḍe nīvu
(||ana||)
sĕlavinavvulalone sĕnagulu vĕdasallī
talam̐suguṁḍave yidi taruṇi nīvu
salivābi nenidi sām̐kirivĕṭṭam̐gam̐bode
kalabīm̐ dana paṁtālu kaṁṭivaḍe nīvu
(||ana||)
kaṁduva siggulalone kām̐giḍanu nannum̐ gūḍĕ
aṁdiyyam̐ gadave viḍĕ madiva nīvu
viṁdulamo vichchidi śhrī veṁkaḍeśhum̐ ḍidanigi
gaṁdamu vūsī nidĕ kaṁṭivaḍĕ nīvu