అనాథులఁ గాచుట అలవాటే తొల్లే నీకు
(॥పల్లవి॥)
అనాథులఁ గాచుట అలవాటే తొల్లే నీకు
వినోదములు గావు విభీషణవరదా
(॥అనా॥)
మలసి నా చిత్తమనే మదమునేనుగ యిదె
జలజావాసపు సంసారములోని
అలయరాజద్వారమను మొసలిచే పడె
కలిగి కావఁగదె కరిరాజవరద
(॥అనా॥)
తుద పంచప్రాణములతోడఁ బుట్టువు లెగురు
కదిసి దేహమనేటికాంతఁ బెండ్లియాడి
అదె దుస్సంగము అనే అడవులఁ దిరిగాడి
పదరెగు కావవే పాండవవరద
(॥అనా॥)
పరికించ జీవుఁడనే పాషాణ మొకటి
సరుగఁ గర్మమనే శాపము నొంది
నిరతి శ్రీ వేంకటేశ నీపాదధూళి మోపి
అరుదుగా నన్నుఁ గావు మహల్యవరదా
(||pallavi||)
anāthulam̐ gāsuḍa alavāḍe tŏlle nīgu
vinodamulu gāvu vibhīṣhaṇavaradā
(||anā||)
malasi nā sittamane madamunenuga yidĕ
jalajāvāsabu saṁsāramuloni
alayarājadvāramanu mŏsalise paḍĕ
kaligi kāvam̐gadĕ karirājavarada
(||anā||)
tuda paṁchaprāṇamuladoḍam̐ buṭṭuvu lĕguru
kadisi dehamaneḍigāṁtam̐ bĕṁḍliyāḍi
adĕ dussaṁgamu ane aḍavulam̐ dirigāḍi
padarĕgu kāvave pāṁḍavavarada
(||anā||)
parigiṁcha jīvum̐ḍane pāṣhāṇa mŏgaḍi
sarugam̐ garmamane śhābamu nŏṁdi
niradi śhrī veṁkaḍeśha nībādadhūḽi mobi
arudugā nannum̐ gāvu mahalyavaradā