అనాథుల రక్షించేది అన్నిటాఁ బుణ్యము గాదా
(॥పల్లవి॥)
అనాథుల రక్షించేది అన్నిటాఁ బుణ్యము గాదా
పెనఁగి నూతికట్ట బిడ్డఁ బట్టవలదా
(॥అనాథు॥)
నావలె మత్తుఁడవా నానా భోగలోలుఁడవా
కావించి బుద్ధి యెఱుఁగనివాఁడవా
భావించి నే జీవుండను ప్రకృతి యిట్టైతేనేమి
దేవుఁడవు నాలోనుండి తెలుపఁగ వలదా
(॥అనాథు॥)
చంచలచిత్తుఁడవా సంసారబద్ధుఁడవా
పొంచి నావలెనే నీ వకించనుఁడవా
ముంచి తెరువెఱుఁగని మూఢుఁడ నైతి నేమి
యెంచి సంగడీఁడవు యెచ్చరించవలదా
(॥అనాథు॥)
యేమఱేటివాఁడవా హీనగుణమువాఁడవా
పామరపు నేఁతల బాగువాఁడవా
నే మానిసి నైతే నేమి నీవు శ్రీవేంకటేశ్వర
దోమటిచుట్టమవు పొందుగాఁ గావ వలదా
(||pallavi||)
anāthula rakṣhiṁchedi anniḍām̐ buṇyamu gādā
pĕnam̐gi nūdigaṭṭa biḍḍam̐ baṭṭavaladā
(||anāthu||)
nāvalĕ mattum̐ḍavā nānā bhogalolum̐ḍavā
kāviṁchi buddhi yĕṟum̐ganivām̐ḍavā
bhāviṁchi ne jīvuṁḍanu prakṛti yiṭṭaidenemi
devum̐ḍavu nālonuṁḍi tĕlubam̐ga valadā
(||anāthu||)
saṁchalasittum̐ḍavā saṁsārabaddhum̐ḍavā
pŏṁchi nāvalĕne nī vagiṁchanum̐ḍavā
muṁchi tĕruvĕṟum̐gani mūḍhum̐ḍa naidi nemi
yĕṁchi saṁgaḍīm̐ḍavu yĕchchariṁchavaladā
(||anāthu||)
yemaṟeḍivām̐ḍavā hīnaguṇamuvām̐ḍavā
pāmarabu nem̐tala bāguvām̐ḍavā
ne mānisi naide nemi nīvu śhrīveṁkaḍeśhvara
domaḍisuṭṭamavu pŏṁdugām̐ gāva valadā