(॥పల్లవి॥)
అనాది సంసారి వటుగాన
మనోవికార మిది మాన దెంతయినా
(॥అనాది॥)
కడు చంచలమేకాని కాయములో నిజబుద్ధి
తొడరదు దుర్భుద్ధి తోఁచి నాకు
దిడువై(?) శ్రీహరి నీవు తిద్దితే నేమోకాని
వెడఁగు నా గుణ మిది విడువ దెంతయినా
(॥అనాది॥)
పలుచింతలే కాని పట్టిన నీపై భక్తి
కలుగ దజ్ఞానమే కప్పీ నాకు
బలిమి బందాలు నీవు నాపితే నేమో కాని
తొలఁకు నా మన సిది తొలఁగ దెంతయినా
(॥అనాది॥)
పట్టిన చలమే కాని పై పై విరక్తి నాకు
నెట్టుకోదు నీ కృప నిలిచీ నాకు
యిట్టే శ్రీ వేంకటేశ యేలిన వాఁడవు నీవు
యెట్టైన నీకుఁ బోదు యెఱుఁగ నెంతయినా
(||pallavi||)
anādi saṁsāri vaḍugāna
manovigāra midi māna dĕṁtayinā
(||anādi||)
kaḍu saṁchalamegāni kāyamulo nijabuddhi
tŏḍaradu durbhuddhi tom̐si nāgu
diḍuvai(?) śhrīhari nīvu tiddide nemogāni
vĕḍam̐gu nā guṇa midi viḍuva dĕṁtayinā
(||anādi||)
palusiṁtale kāni paṭṭina nībai bhakti
kaluga dajñāname kappī nāgu
balimi baṁdālu nīvu nābide nemo kāni
tŏlam̐ku nā mana sidi tŏlam̐ga dĕṁtayinā
(||anādi||)
paṭṭina salame kāni pai pai virakti nāgu
nĕṭṭugodu nī kṛpa nilisī nāgu
yiṭṭe śhrī veṁkaḍeśha yelina vām̐ḍavu nīvu
yĕṭṭaina nīgum̐ bodu yĕṟum̐ga nĕṁtayinā