Amtumuttugu ne noba namte kaani

అంటుముట్టుకు నే నోప నంతే కాని
Language

(॥పల్లవి॥)
అంటుముట్టుకు నే నోప నంతే కాని
యింటింటఁ దనకే యివి యితవవుఁ గాని

(॥అంటు॥)
పుక్కిటితమ్ముల మటుపో నుమిసి రమ్మనవే
యెక్కడిదో వీడెము నే నిచ్చేఁ గాని
అక్కడ నేడవో వుద్దా ల టూడిచి రమ్మనవే
గక్కునఁ బాదాలు నేఁ గడిగేఁ గాని

(॥అంటు॥)
అవలఁ జెంగావిరెంటె మటు వెట్టి రమ్మనవే
యీవిగాఁ బచ్చడము నే నిచ్చేఁగాని
పూవులు తురుము లెల్లాఁ బో దులిపి రమ్మనవే
యీవలఁ గమ్మని జాజు లిచ్చేఁ గాని

(॥అంటు॥)
తోఁగుఁ జెమ టెక్కడిదో తుడుచుకో రమ్మనవే
కౌఁగిటఁ గమ్మర నేనే కమ్మించేఁ గాని
వీఁగక శ్రీ వేంకటాద్రివిభుఁడిట్టే నన్నుఁ గూడె
పాఁగిన తమకమునఁ బదరకు మనవే

(||pallavi||)
aṁṭumuṭṭugu ne noba naṁte kāni
yiṁṭiṁṭam̐ danage yivi yidavavum̐ gāni

(||aṁṭu||)
pukkiḍidammula maḍubo numisi rammanave
yĕkkaḍido vīḍĕmu ne nichchem̐ gāni
akkaḍa neḍavo vuddā la ṭūḍisi rammanave
gakkunam̐ bādālu nem̐ gaḍigem̐ gāni

(||aṁṭu||)
avalam̐ jĕṁgāvirĕṁṭĕ maḍu vĕṭṭi rammanave
yīvigām̐ bachchaḍamu ne nichchem̐gāni
pūvulu turumu lĕllām̐ bo dulibi rammanave
yīvalam̐ gammani jāju lichchem̐ gāni

(||aṁṭu||)
tom̐gum̐ jĕma ṭĕkkaḍido tuḍusugo rammanave
kaum̐giḍam̐ gammara nene kammiṁchem̐ gāni
vīm̐gaga śhrī veṁkaḍādrivibhum̐ḍiṭṭe nannum̐ gūḍĕ
pām̐gina tamagamunam̐ badaragu manave