అంటివి వింటిని అవుఁ బదరా నీ
(॥పల్లవి॥)
అంటివి వింటిని అవుఁ బదరా నీ-
దంటతనంబులు తగుతగురా
(॥అంటి॥)
నిక్కల గంటిని నీమాట చేకొంటి
చొక్కుల నను నిఁక సొలయకురా
చెక్కిలి నొక్కిలి సేసయుఁ బెట్టితి
యెక్కడిసుద్దులు యేఁటికిరా
(॥అంటి॥)
సెలవుల నగితిని సేఁతలఁ దెగితిని
బెళకుల ఆనలు పెట్టకురా
పులకల ముణిఁగితి బూతులఁ గొణఁగితి
వలపుల చల్లఁగవలెనటరా
(॥అంటి॥)
కాఁకల వాడితిఁ గాఁగిటఁ గూడితి
వాకుసరసములు వలెనటరా
యీకడ శ్రీవేంకటేశ నీప్రియము
కైకొంటి పయ్యెదఁ గప్పేరా
(||pallavi||)
aṁṭivi viṁṭini avum̐ badarā nī-
daṁṭadanaṁbulu tagudagurā
(||aṁṭi||)
nikkala gaṁṭini nīmāḍa segŏṁṭi
sŏkkula nanu nim̐ka sŏlayagurā
sĕkkili nŏkkili sesayum̐ bĕṭṭidi
yĕkkaḍisuddulu yem̐ṭigirā
(||aṁṭi||)
sĕlavula nagidini sem̐talam̐ dĕgidini
bĕḽagula ānalu pĕṭṭagurā
pulagala muṇim̐gidi būdulam̐ gŏṇam̐gidi
valabula sallam̐gavalĕnaḍarā
(||aṁṭi||)
kām̐kala vāḍidim̐ gām̐giḍam̐ gūḍidi
vāgusarasamulu valĕnaḍarā
yīgaḍa śhrīveṁkaḍeśha nīpriyamu
kaigŏṁṭi payyĕdam̐ gapperā