అంటి నిన్నుఁ బాయలేని దాపె తలనే వేగెనా
(॥పల్లవి॥)
అంటి నిన్నుఁ బాయలేని దాపె తలనే వేగెనా
వెంటవెంటఁ దిరుగరా వెలఁదు లెల్లాను
(॥అంటి॥)
తలకొని నీమోము తప్పకచూచితేను
వలవరా యెటువంటివనితలైనా
సెలవుల నేపాటైనా చిరునవ్వు నవ్వితేను
మొలవవా పులకలు మోపులకొలఁదులు
(॥అంటి॥)
చనవుల నీతోను సరసములాడితేను
మనసులు గరఁగరా మగువలెల్లా
యెనసి నీతోఁగన యేపాటి మాటాడినాను
తనుఁదానె కాఁగిళ్ళు తగులుకోకుండునా
(॥అంటి॥)
నివ్వటిల్లుతమకాన నీమేనుసోఁకితేను
నివ్వెరనుఁ బొందరా నెలఁతలెల్లా
రవ్వగా శ్రీవేంకటేశ రతి నలమేలుమంగ
యివ్వలఁ గూడినందుకు హెచ్చవా వేడుకలు
(||pallavi||)
aṁṭi ninnum̐ bāyaleni dābĕ talane vegĕnā
vĕṁṭavĕṁṭam̐ dirugarā vĕlam̐du lĕllānu
(||aṁṭi||)
talagŏni nīmomu tappagasūsidenu
valavarā yĕḍuvaṁṭivanidalainā
sĕlavula nebāḍainā sirunavvu navvidenu
mŏlavavā pulagalu mobulagŏlam̐dulu
(||aṁṭi||)
sanavula nīdonu sarasamulāḍidenu
manasulu garam̐garā maguvalĕllā
yĕnasi nīdom̐gana yebāḍi māḍāḍinānu
tanum̐dānĕ kām̐giḽḽu tagulugoguṁḍunā
(||aṁṭi||)
nivvaḍilludamagāna nīmenusom̐kidenu
nivvĕranum̐ bŏṁdarā nĕlam̐talĕllā
ravvagā śhrīveṁkaḍeśha radi nalamelumaṁga
yivvalam̐ gūḍinaṁdugu hĕchchavā veḍugalu