Amti muttina panulu aadam derumgu

అంటి ముట్టిన పనులు ఆతఁ డెరుఁగు
Language

(॥పల్లవి॥)
అంటి ముట్టిన పనులు ఆతఁ డెరుఁగు
వెంట వెంట మీరు నన్ను వేఁడుకొన నేఁటికే

(॥అంటి॥)
నగిన దొక్కటే కాని నాకు నేమిఁ దెలియదు
అగవుఁ దగవు లెల్లా నాతఁ డెరుఁగు
జగడాలడిచితినా సరవితో నున్నదాన
వెగటుగా నన్ను మీరు వేఁడుకొన నేఁటికే

(॥అంటి॥)
మొక్కిన దొక్కటే కాని ముందు వెనక లెంచను
అక్క డిక్కడి సుద్దులు ఆతఁ డెరుఁగు
తక్కులఁ బెట్టేనా తనదాననే నేను
వెక్కసాన మీరు నన్ను వేఁడుకొన నేఁటికే

(॥అంటి॥)
కూడిన దొక్కటే కాని గుట్టు బాఇట వేయను
ఆడుకొలు బాసలెల్ల నాతఁ డెరుఁగు
యీడనే శ్రీ వేంకటేశుఁ డిరవుగా నన్నుఁ గూడె
వేడుకకు నన్ను నింత వేఁడుకొన నేఁటికే

(||pallavi||)
aṁṭi muṭṭina panulu ādam̐ ḍĕrum̐gu
vĕṁṭa vĕṁṭa mīru nannu vem̐ḍugŏna nem̐ṭige

(||aṁṭi||)
nagina dŏkkaḍe kāni nāgu nemim̐ dĕliyadu
agavum̐ dagavu lĕllā nādam̐ ḍĕrum̐gu
jagaḍālaḍisidinā saravido nunnadāna
vĕgaḍugā nannu mīru vem̐ḍugŏna nem̐ṭige

(||aṁṭi||)
mŏkkina dŏkkaḍe kāni muṁdu vĕnaga lĕṁchanu
akka ḍikkaḍi suddulu ādam̐ ḍĕrum̐gu
takkulam̐ bĕṭṭenā tanadānane nenu
vĕkkasāna mīru nannu vem̐ḍugŏna nem̐ṭige

(||aṁṭi||)
kūḍina dŏkkaḍe kāni guṭṭu bāiḍa veyanu
āḍugŏlu bāsalĕlla nādam̐ ḍĕrum̐gu
yīḍane śhrī veṁkaḍeśhum̐ ḍiravugā nannum̐ gūḍĕ
veḍugagu nannu niṁta vem̐ḍugŏna nem̐ṭige