అంతేని మే మెఱఁగము ఆఁడువారము
(॥పల్లవి॥)
అంతేని మే మెఱఁగము ఆఁడువారము
సంతలో నేరుచుకొని జాణము గారాదా
(॥అంతే॥)
కూడిమాడి వుండి నీతోఁ గోపగించితి ననేవు
వాడికెవారి నవ్వులు వచ్చీనా మాకు
వేడుక కాఁడవు నీకు వేగిరము గలితేను
నీడల నూరివారితో నీవు నవ్వరాదా
(॥అంతే॥)
వోముక మారుమొగమై వూరకుందాన ననేవు
దోమటి గొల్లమాటలు తోఁచీనా మాకు
ప్రేమమున నీకు నింత పెక్కులాడవలసితే
నీమాటలు నా మాటలు నీవే యాడరాదా
(॥అంతే॥)
కన్నులఁగంటానే వచ్చి కాఁగిలించుకో ననేవు
నిన్నటివారి నేర్పులు నేర్చేమానేము
అన్నిటా శ్రీ వేంకటేశ ఆయములంటి కూడితి
వెన్ని గలవు నీ పొందు లెనయఁగరాదా
(||pallavi||)
aṁteni me mĕṟam̐gamu ām̐ḍuvāramu
saṁtalo nerusugŏni jāṇamu gārādā
(||aṁte||)
kūḍimāḍi vuṁḍi nīdom̐ gobagiṁchidi nanevu
vāḍigĕvāri navvulu vachchīnā māgu
veḍuga kām̐ḍavu nīgu vegiramu galidenu
nīḍala nūrivārido nīvu navvarādā
(||aṁte||)
vomuga mārumŏgamai vūraguṁdāna nanevu
domaḍi gŏllamāḍalu tom̐sīnā māgu
premamuna nīgu niṁta pĕkkulāḍavalaside
nīmāḍalu nā māḍalu nīve yāḍarādā
(||aṁte||)
kannulam̐gaṁṭāne vachchi kām̐giliṁchugo nanevu
ninnaḍivāri nerbulu nersemānemu
anniḍā śhrī veṁkaḍeśha āyamulaṁṭi kūḍidi
vĕnni galavu nī pŏṁdu lĕnayam̐garādā