అంతెకాదా వుప్పు వేసి అట్టె పొత్తు గలసేవు
(॥పల్లవి॥)
అంతెకాదా వుప్పు వేసి అట్టె పొత్తు గలసేవు
వింతలాయ నీవు నొక వినోదకత్తెవు
(॥అంతె॥)
వారక నాయిల్లు చొచ్చి వచ్చి రమణునితోడ
సారెకు నవ్వే వౌనే జాణకత్తెవు
కూరిమి నామంచముపైఁ గూచుండఁగా విడెము
తారి తారి యిచ్చేవేమే తాలిమికత్తెవు
(॥అంతె॥)
మగని నే దూరితేను మరి పూసుక వచ్చేవు
జిగి నీవు గలితిగా చెలికత్తెవు
పగటున నాకాఁగిటి సతిపాదాలు గుద్దేవు
వెగటులే కిపుడైతివే వూడిగకత్తెవు
(॥అంతె॥)
అలమేలుమంగ నేను అతఁడు శ్రీవేంకటేశుఁ
డెలమి నవ్వులు నవ్వే వెమ్మెకత్తెవు
కలసె నాతఁడు నన్ను కాంతుని నీవూఁ గూడేవు
తెలిసితి నీగుణము తేరకత్తెవు
(||pallavi||)
aṁtĕgādā vuppu vesi aṭṭĕ pŏttu galasevu
viṁtalāya nīvu nŏga vinodagattĕvu
(||aṁtĕ||)
vāraga nāyillu sŏchchi vachchi ramaṇunidoḍa
sārĕgu navve vaune jāṇagattĕvu
kūrimi nāmaṁchamubaim̐ gūsuṁḍam̐gā viḍĕmu
tāri tāri yichcheveme tālimigattĕvu
(||aṁtĕ||)
magani ne dūridenu mari pūsuga vachchevu
jigi nīvu galidigā sĕligattĕvu
pagaḍuna nāgām̐giḍi sadibādālu guddevu
vĕgaḍule kibuḍaidive vūḍigagattĕvu
(||aṁtĕ||)
alamelumaṁga nenu adam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍĕlami navvulu navve vĕmmĕgattĕvu
kalasĕ nādam̐ḍu nannu kāṁtuni nīvūm̐ gūḍevu
tĕlisidi nīguṇamu teragattĕvu