Amtegaadaa mari aayamgaa pani

అంతేకాదా మరి ఆయఁగా పని
Language

(॥పల్లవి॥)
అంతేకాదా మరి ఆయఁగా పని
చెంతఁ జక్కనివా రూరఁ జేరివుండఁ బాసెనా

(॥అంతే॥)
ఔరా నీపగటు ఆయము లంటవచ్చేవు
మారుమాటాడకుంటేనే మన సిస్తినా
సారెనేల పట్టేవు చక్కనుండేవో వుండవో
నేరిచి మా వారు నన్ను నీకుఁగానే కనిరా

(॥అంతే॥)
అద్దో నీ బలువు అద్దలించి పిలిచేవు
వద్దన జాలకుంటేనే వసమైతినా
వొద్దువోదా నీకదేమి బూతులనే గొఱఁగేవు
బుద్దిలో(లే)నిమరుఁడు నీపొరుగే కాఁ జేసెనా

(॥అంతే॥)
మేలువో నీతగవు మించి నన్నుఁ గూడేవు
మేలవడకుంటేనే మెచ్చనైతినా
పాలించి శ్రీవేంకటేశ పకపకనవ్వేవు
పాలవంటివయను నీపాలికిట్టె దక్కెనా

(||pallavi||)
aṁtegādā mari āyam̐gā pani
sĕṁtam̐ jakkanivā rūram̐ jerivuṁḍam̐ bāsĕnā

(||aṁte||)
aurā nībagaḍu āyamu laṁṭavachchevu
mārumāḍāḍaguṁṭene mana sistinā
sārĕnela paṭṭevu sakkanuṁḍevo vuṁḍavo
nerisi mā vāru nannu nīgum̐gāne kanirā

(||aṁte||)
addo nī baluvu addaliṁchi pilisevu
vaddana jālaguṁṭene vasamaidinā
vŏdduvodā nīgademi būdulane gŏṟam̐gevu
buddilo(le)nimarum̐ḍu nībŏruge kām̐ jesĕnā

(||aṁte||)
meluvo nīdagavu miṁchi nannum̐ gūḍevu
melavaḍaguṁṭene mĕchchanaidinā
pāliṁchi śhrīveṁkaḍeśha pagabaganavvevu
pālavaṁṭivayanu nībāligiṭṭĕ dakkĕnā