అంతేపో మంచివాఁడ వౌదు వయ్యా
(॥పల్లవి॥)
అంతేపో మంచివాఁడ వౌదు వయ్యా
యింత నీ పంచెను బూతా లెఱుఁగవా అయ్యా
(॥అంతే॥)
చిత్తజకేలికి నిన్నుఁ జేవట్టి తీసిన తప్పు
కత్తిగోరు దాఁకె నంటా గడించవయ్యా
బత్తితోఁ బానుపుమీఁదఁ బవళింపించిన తప్పు
హత్తి నే దొబ్బితి నంటా నాడుకొనవయ్యా
(॥అంతే॥)
అంది పువ్వులు ముడిచి అంగము లంటిన తప్పు
ముందల వట్టితి నంటా మొరయవయ్యా
విందుగాఁ బొత్తునకు నే వేడుక రమ్మన్నతప్పు
చెంది నిన్ను నెంగిలి సేసితి ననుకోవయ్యా
(॥అంతే॥)
బిగ్గెఁ గౌఁగిలించుకొని పెనఁగిన యాతప్పు
దిగ్గన నే గబ్బి నంటాఁ దిట్టవయ్యా
సిగ్గుదేరఁ గూడితిని శ్రీ వేంకటేశ్వర నిన్ను
యెగ్గొ తప్పో యిందుకు నేమైనాఁ జేయవయ్యా
(||pallavi||)
aṁtebo maṁchivām̐ḍa vaudu vayyā
yiṁta nī paṁchĕnu būdā lĕṟum̐gavā ayyā
(||aṁte||)
sittajageligi ninnum̐ jevaṭṭi tīsina tappu
kattigoru dām̐kĕ naṁṭā gaḍiṁchavayyā
battidom̐ bānubumīm̐dam̐ bavaḽiṁpiṁchina tappu
hatti ne dŏbbidi naṁṭā nāḍugŏnavayyā
(||aṁte||)
aṁdi puvvulu muḍisi aṁgamu laṁṭina tappu
muṁdala vaṭṭidi naṁṭā mŏrayavayyā
viṁdugām̐ bŏttunagu ne veḍuga rammannadappu
sĕṁdi ninnu nĕṁgili sesidi nanugovayyā
(||aṁte||)
biggĕm̐ gaum̐giliṁchugŏni pĕnam̐gina yādappu
diggana ne gabbi naṁṭām̐ diṭṭavayyā
sigguderam̐ gūḍidini śhrī veṁkaḍeśhvara ninnu
yĕggŏ tappo yiṁdugu nemainām̐ jeyavayyā