అంటె తా ననేఁ గాక అవునే తాను
(॥పల్లవి॥)
అంటె తా ననేఁ గాక అవునే తాను
దంటయై తన గుణాలు తడవితినా
(॥అంటే॥)
చెప్పనీవే నావంక సేసినకల్ల లేమయినా
నిప్పంటే నోరు వొక్కనేరదు గదే
తప్పు గాదు దాని కేమి తనమీఁదనేఁ దొలుత
నెప్పున నలిగీ నదీ నిజమా యడుగరే
(॥అంటే॥)
యిదినో తనతగవే యిందరితోఁ జెప్ప వచ్చి
యెదురులేనిమాట కదురు గదే
వొదిగి యూరకుండితే వొకటొకటే రేఁచి
తుద నావంటిసతులు దొరకేరు తనకు
(॥అంటే॥)
సారె సారె తానే నాతో సరసములాడఁగాను
గోర గీరినవి యెల్లా యేరు లాయనే
మేరతో శ్రీవేంకటాద్రిమేటి నన్ను నిదె కూడె
తారుకాణ లైనవి తానే యెఱుఁగునే
(||pallavi||)
aṁṭĕ tā nanem̐ gāga avune tānu
daṁṭayai tana guṇālu taḍavidinā
(||aṁṭe||)
sĕppanīve nāvaṁka sesinagalla lemayinā
nippaṁṭe noru vŏkkaneradu gade
tappu gādu dāni kemi tanamīm̐danem̐ dŏluda
nĕppuna naligī nadī nijamā yaḍugare
(||aṁṭe||)
yidino tanadagave yiṁdaridom̐ jĕppa vachchi
yĕdurulenimāḍa kaduru gade
vŏdigi yūraguṁḍide vŏgaḍŏgaḍe rem̐si
tuda nāvaṁṭisadulu dŏrageru tanagu
(||aṁṭe||)
sārĕ sārĕ tāne nādo sarasamulāḍam̐gānu
gora gīrinavi yĕllā yeru lāyane
merado śhrīveṁkaḍādrimeḍi nannu nidĕ kūḍĕ
tārugāṇa lainavi tāne yĕṟum̐gune