అంతే పో వోయమ్మ ఔనయ్య మంచివాఁడవు
(॥పల్లవి॥)
అంతే పో వోయమ్మ ఔనయ్య మంచివాఁడవు
పంతాన నీతోఁ బెనఁగేపాటిదా యీమగువ
(॥॥)
కన్నె పడుచైనదానిఁ గాఁగిట బిగింతురా
పన్ని పూవువలెఁ జేతఁ బట్టుట గాక
చిన్నిచన్ను లొక్కమాఁటే చిప్పిలఁ బిసుకుదురా
మన్ననలనే రతుల మరపుట గాక
(॥॥)
సిగ్గరి పెండ్లికూఁతురుఁ జింధు వందు గాఁ దీతురా
వొగ్గి రొమ్ము మీఁదఁ బెట్టుకుండుట గాక
కగ్గులేని కెమ్మోవి కడుఁ బిప్పి సేతురా
తగ్గుకుండాఁ గాఁగిటఁ దమిరేఁచుటగాక
(॥॥)
కొత్త వయసుపడుచు గోరికొన సోఁకింతురా
పొత్తుగ లాలన సేసి పొందుటగాక
యిత్తల శ్రీ వేంకటేశ యిన్నిటా నీవేలితివి
నిత్తెము నీ సేవలెల్లా నేరుపుటగాక
(||pallavi||)
aṁte po voyamma aunayya maṁchivām̐ḍavu
paṁtāna nīdom̐ bĕnam̐gebāḍidā yīmaguva
(||||)
kannĕ paḍusainadānim̐ gām̐giḍa bigiṁturā
panni pūvuvalĕm̐ jedam̐ baṭṭuḍa gāga
sinnisannu lŏkkamām̐ṭe sippilam̐ bisugudurā
mannanalane radula marabuḍa gāga
(||||)
siggari pĕṁḍligūm̐turum̐ jiṁdhu vaṁdu gām̐ dīdurā
vŏggi rŏmmu mīm̐dam̐ bĕṭṭuguṁḍuḍa gāga
kagguleni kĕmmovi kaḍum̐ bippi sedurā
tagguguṁḍām̐ gām̐giḍam̐ damirem̐suḍagāga
(||||)
kŏtta vayasubaḍusu gorigŏna som̐kiṁturā
pŏttuga lālana sesi pŏṁduḍagāga
yittala śhrī veṁkaḍeśha yinniḍā nīvelidivi
nittĕmu nī sevalĕllā nerubuḍagāga