Amte po tana pomdu laduvamtivaa

అంతే పో తన పొందు లటువంటివా
Language

(॥పల్లవి॥)
అంతే పో తన పొందు లటువంటివా
చింత దీర నా మనసు చిత్తగించ నీవే

(॥॥)
వింతవాఁడా తానేమి విచ్చేయ మనఁగదే
చెంత నుండి నాకేమి చెప్పెంపీఁ దాను
పంత గత్తెనా నేను పై పై నేమి వేఁడుకొని
యింతటికి నేనే మొక్కే నిటు చూడనీఁ గదే

(॥॥)
నేఁడు గీత్తలా తనకు నిండుకొన్న నాపై బత్తి
పోఁడిమి నా కేల చూపి పొదిగీఁ దాను
వాఁడిమాట లాడేనా వచ్చి నన్నేల పొదిగీ
పేఁడుకొని వలపు రేపించెఁ జూడనీవే

(॥॥)
యెరవా తనకు నాకు నియ్యకో లయిన చోట
గరిమ నెగ్గు వట్టేనా కౌఁగిలించీని
యిరవై శ్రీ వేంకటేశుఁ డిప్పుడే తా నన్నుఁగూడె
బెరసిన రతుల మెప్పించెఁ జూడనీవే

(||pallavi||)
aṁte po tana pŏṁdu laḍuvaṁṭivā
siṁta dīra nā manasu sittagiṁcha nīve

(||||)
viṁtavām̐ḍā tānemi vichcheya manam̐gade
sĕṁta nuṁḍi nāgemi sĕppĕṁpīm̐ dānu
paṁta gattĕnā nenu pai pai nemi vem̐ḍugŏni
yiṁtaḍigi nene mŏkke niḍu sūḍanīm̐ gade

(||||)
nem̐ḍu gīttalā tanagu niṁḍugŏnna nābai batti
pom̐ḍimi nā kela sūbi pŏdigīm̐ dānu
vām̐ḍimāḍa lāḍenā vachchi nannela pŏdigī
pem̐ḍugŏni valabu rebiṁchĕm̐ jūḍanīve

(||||)
yĕravā tanagu nāgu niyyago layina soḍa
garima nĕggu vaṭṭenā kaum̐giliṁchīni
yiravai śhrī veṁkaḍeśhum̐ ḍippuḍe tā nannum̐gūḍĕ
bĕrasina radula mĕppiṁchĕm̐ jūḍanīve