Amte pani galide naanadeevayyaa

అంతే పని గలితే నానతీవయ్యా
Language

(॥పల్లవి॥)
అంతే పని గలితే నానతీవయ్యా
వింతవారమా నేము వెఱపేలయ్యా

(॥అంతే॥)
తలఁపు లేకములైతే తగవుకుఁ బనిలేదు
చెలులసాకిరులేల చెప్పేవయ్యా
నిలుచున్నాఁడ వప్పటి నీ కెంత పనిగద్దో
యెలమి మాతో జోలి యెందాఁకానయ్యా

(॥అంతే॥)
బాసలే నీజములైతే పదరఁగఁ బనిలేదు
గోసనాసగా వేఁడుకొన నేలయ్యా
ఆసపడ్డాఁడవు నీవు అడ్డమాడ దోసము
సేసపాలదాన నీ చిత్తమిఁకనయ్యా

(॥అంతే॥)
కూడిన యిప్పటిమీఁద కొసరఁగఁ బనిలేదు
నోడలఁ బెట్టుచుఁ జెక్కునొక్కనేలయ్యా
యీడనే శ్రీ వేంకటేశ యెనసితివి పాయపు
వీడెమిచ్చెలసితివి వేగినంతానయ్యా

(||pallavi||)
aṁte pani galide nānadīvayyā
viṁtavāramā nemu vĕṟabelayyā

(||aṁte||)
talam̐pu legamulaide tagavugum̐ baniledu
sĕlulasāgirulela sĕppevayyā
nilusunnām̐ḍa vappaḍi nī kĕṁta panigaddo
yĕlami mādo joli yĕṁdām̐kānayyā

(||aṁte||)
bāsale nījamulaide padaram̐gam̐ baniledu
gosanāsagā vem̐ḍugŏna nelayyā
āsabaḍḍām̐ḍavu nīvu aḍḍamāḍa dosamu
sesabāladāna nī sittamim̐kanayyā

(||aṁte||)
kūḍina yippaḍimīm̐da kŏsaram̐gam̐ baniledu
noḍalam̐ bĕṭṭusum̐ jĕkkunŏkkanelayyā
yīḍane śhrī veṁkaḍeśha yĕnasidivi pāyabu
vīḍĕmichchĕlasidivi veginaṁtānayyā