అంటే నిన్ననరాదు ఆడకున్నఁ బోదు నేఁడు
(॥పల్లవి॥)
అంటే నిన్ననరాదు ఆడకున్నఁ బోదు నేఁడు
యింటి కేఁగినవాఁడ వింత చేసి వత్తురా
(॥అంటే॥)
వాసులకు నోరు మూసీ వలపులఁ జలి గాసీ
యీసులకు మాటాడ వెవ్వరి తోడి
కాసు సేయనిపనికి కాంత నే మంటివో గాని
దోసానకు రోయవు నీ తోడి దేఁటిమాటలు
(॥అంటే॥)
గుట్టుతోడఁ దల వంచీ కోపములఁ జిగిరించీ
కట్టిడితనాలు చల్లీ కాంతలమీఁద
చిట్టికా లాపెతో నేమి చేసితివొ చలాలకు
ముట్టి వచ్చె నీకు దూరు ముందర నెరఁగవు
(॥అంటే॥)
పంతానకుఁ గాలు మెట్టీ పాయముల మీఁదుకట్టీ
బంతి నండవారి నెల్లఁ బంగించీని
యింతలోనె శ్రీవేంకటేశ నీ వింతిఁ గూడితి-
వంతరంగమున మేలు అది నీ కింకెట్టిదో
(||pallavi||)
aṁṭe ninnanarādu āḍagunnam̐ bodu nem̐ḍu
yiṁṭi kem̐ginavām̐ḍa viṁta sesi vatturā
(||aṁṭe||)
vāsulagu noru mūsī valabulam̐ jali gāsī
yīsulagu māḍāḍa vĕvvari toḍi
kāsu seyanibanigi kāṁta ne maṁṭivo gāni
dosānagu royavu nī toḍi dem̐ṭimāḍalu
(||aṁṭe||)
guṭṭudoḍam̐ dala vaṁchī kobamulam̐ jigiriṁchī
kaṭṭiḍidanālu sallī kāṁtalamīm̐da
siṭṭigā lābĕdo nemi sesidivŏ salālagu
muṭṭi vachchĕ nīgu dūru muṁdara nĕram̐gavu
(||aṁṭe||)
paṁtānagum̐ gālu mĕṭṭī pāyamula mīm̐dugaṭṭī
baṁti naṁḍavāri nĕllam̐ baṁgiṁchīni
yiṁtalonĕ śhrīveṁkaḍeśha nī viṁtim̐ gūḍidi-
vaṁtaraṁgamuna melu adi nī kiṁkĕṭṭido