Amte nee vemainaa namtivi gaani

అంతే నీ వేమైనా నంటివి గాని
Language

(॥పల్లవి॥)
అంతే నీ వేమైనా నంటివి గాని
జంటయై మీరుండఁగాను సరిఁ జూడరాదుగా

(॥అంటే॥)
పోపో నీ వాపె నెంత పొడవు లెక్కించినాను
రాపుల నాపెకు మొక్కరాదుగా నాకు
కోపగించి నిన్ను నాపె గొణఁగి తిట్టె నంటా
యేపున నే వెఱవఁగ యింత పని లేదుగా

(॥అంటే॥)
అవులే నీతో నాకె అలిగివుండిన దంటా
రవళిప్రియాలు చెప్పరాదుగా నాకు
జవదాఁట కాపెపంపు సారె నీవు సేసే వంటా
యివల నే నందులకు నిచ్చగించఁ జాలఁ గా

(॥అంటే॥)
కాతరాన నాకె నీవు కదసి పెండ్లాడే వంటా
రాతిరెల్లా వేగించరాదుగా నాకు
యీతల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
తోతో నిన్నిఁక నేను దొమ్మి సేయరాదుగా

(||pallavi||)
aṁte nī vemainā naṁṭivi gāni
jaṁṭayai mīruṁḍam̐gānu sarim̐ jūḍarādugā

(||aṁṭe||)
pobo nī vābĕ nĕṁta pŏḍavu lĕkkiṁchinānu
rābula nābĕgu mŏkkarādugā nāgu
kobagiṁchi ninnu nābĕ gŏṇam̐gi tiṭṭĕ naṁṭā
yebuna ne vĕṟavam̐ga yiṁta pani ledugā

(||aṁṭe||)
avule nīdo nāgĕ aligivuṁḍina daṁṭā
ravaḽipriyālu sĕpparādugā nāgu
javadām̐ṭa kābĕbaṁpu sārĕ nīvu sese vaṁṭā
yivala ne naṁdulagu nichchagiṁcham̐ jālam̐ gā

(||aṁṭe||)
kādarāna nāgĕ nīvu kadasi pĕṁḍlāḍe vaṁṭā
rādirĕllā vegiṁcharādugā nāgu
yīdala śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
todo ninnim̐ka nenu dŏmmi seyarādugā