అంటే ననరాదు నిన్ను నాఱడి సేసెననేవు
(॥పల్లవి॥)
అంటే ననరాదు నిన్ను నాఱడి సేసెననేవు
జంటల నీకెరుకగా సన్నసేయనా
(॥అంటే॥)
వాకిట నే నుండఁగానే వడి నిన్ను దూరంగానే
ఆకెయింటి కేఁగవా అప్పుడు నీవు
కాకుసేసితి ననేవు గామిడితనాలసేవు
నీకు నీకే యించుకొమ్మా నీవోజలు
(॥అంటే॥)
పేర నేఁ బిలువఁగానే ప్రియములు చెప్పఁగానే
ఆ రీతి నాపెతో మాటలాడవా నీవు
యీరసించితి ననేవు యెగ్గువట్టితి ననేవు
తారుకాణ సేసుకొమ్మా తగిలి నీసేఁతలు
(॥అంటే॥)
కమ్ముక నేఁ జూడఁగానూ కనకవ నవ్వఁగానే
నెమ్మిఁ గాఁగిలించ వా నీవే ఆపెను
నమ్మించి శ్రవేంకటేశ నన్ను నిట్టె యేలితివి
సమ్మతించఁ జేసుకొమ్మా సారెకు నీమనసు
(||pallavi||)
aṁṭe nanarādu ninnu nāṟaḍi sesĕnanevu
jaṁṭala nīgĕrugagā sannaseyanā
(||aṁṭe||)
vāgiḍa ne nuṁḍam̐gāne vaḍi ninnu dūraṁgāne
āgĕyiṁṭi kem̐gavā appuḍu nīvu
kāgusesidi nanevu gāmiḍidanālasevu
nīgu nīge yiṁchugŏmmā nīvojalu
(||aṁṭe||)
pera nem̐ biluvam̐gāne priyamulu sĕppam̐gāne
ā rīdi nābĕdo māḍalāḍavā nīvu
yīrasiṁchidi nanevu yĕgguvaṭṭidi nanevu
tārugāṇa sesugŏmmā tagili nīsem̐talu
(||aṁṭe||)
kammuga nem̐ jūḍam̐gānū kanagava navvam̐gāne
nĕmmim̐ gām̐giliṁcha vā nīve ābĕnu
nammiṁchi śhraveṁkaḍeśha nannu niṭṭĕ yelidivi
sammadiṁcham̐ jesugŏmmā sārĕgu nīmanasu