అంతే కలితే నీవు ఆతనివద్దికి రావే
(॥పల్లవి॥)
అంతే కలితే నీవు ఆతనివద్దికి రావే
కాంతరో అన్నియుఁ దారుకాణించె నిపుడు
(॥అంతే॥)
యేమి సేసినో యంటా నేకతాన దగ్గిరితే
కామించి యాతఁడు నన్నుఁ గరఁగించెనూ
నీమనసున విభుని నేనే యంటితి నంటా
మోము చూచి నవ్వేవు మొరసి యే ముందునే
(॥అంతే॥)
సూడు వట్టి నే నాతని జూజ మాడఁ బిలిచితే
కూడఁ బట్టి తానె దక్కఁ గొనె నన్నునూ
తోడనె వెంగె మావేడు దొమ్నినేఁ జేసితి నంటా
ఆడియు నాడవు నన్ను నందుకు నే మందునే
(॥అంతే॥)
నీతోడి చుట్టరికాన నే మొక్తితే నన్నుఁ గూడె
యీతల శ్రీవెంకటేశుఁ డిచ్చకాననూ
నీతితో న నన్నడిగగేవు నీ వెఱఁగ వటే యిది
యేతరీఁ డాతఁడు నీతో నే ముందునే
(||pallavi||)
aṁte kalide nīvu ādanivaddigi rāve
kāṁtaro anniyum̐ dārugāṇiṁchĕ nibuḍu
(||aṁte||)
yemi sesino yaṁṭā negadāna daggiride
kāmiṁchi yādam̐ḍu nannum̐ garam̐giṁchĕnū
nīmanasuna vibhuni nene yaṁṭidi naṁṭā
momu sūsi navvevu mŏrasi ye muṁdune
(||aṁte||)
sūḍu vaṭṭi ne nādani jūja māḍam̐ biliside
kūḍam̐ baṭṭi tānĕ dakkam̐ gŏnĕ nannunū
toḍanĕ vĕṁgĕ māveḍu dŏmninem̐ jesidi naṁṭā
āḍiyu nāḍavu nannu naṁdugu ne maṁdune
(||aṁte||)
nīdoḍi suṭṭarigāna ne mŏktide nannum̐ gūḍĕ
yīdala śhrīvĕṁkaḍeśhum̐ ḍichchagānanū
nīdido na nannaḍigagevu nī vĕṟam̐ga vaḍe yidi
yedarīm̐ ḍādam̐ḍu nīdo ne muṁdune