అంతయు నీకే చెల్లు నవులేవయ్యా
(॥పల్లవి॥)
అంతయు నీకే చెల్లు నవులేవయ్యా
అంతర మెఱుఁగుదువు ఔలేవయ్యా
(॥అంతి॥)
నేరక నే మీఁదమీఁద నీకు వలవఁగఁబట్టి
అరటానఁబెట్టితి నీ వౌలేవయ్యా
ఆరీతి వేరుసేయక అండకు నే రాఁబట్టి
ఆరితేరెఁ బనులెల్లా నౌలేవయ్యా
(॥అంతి॥)
యేమీననక నీకె యిచ్చకాలాడఁగఁబట్టి
ఆమాఁటలాడితివి ఔలేవయ్యా
కామించి వొకరివలె గయ్యాళించకుండఁబట్టి
ఆమీఁద నొత్తుకవచ్చే వౌలేవయ్యా
(॥అంతి॥)
కాదుగూడదనక నీకై వశముగాఁబట్టి
ఆదరించి కూడితివి ఔలేవయ్య
యీదెస శ్రీవేంకటేశ యిటు నన్ను మెచ్చఁబట్టి
ఆదెస నవ్వులు నవ్వే వౌలేవయ్య
(||pallavi||)
aṁtayu nīge sĕllu navulevayyā
aṁtara mĕṟum̐guduvu aulevayyā
(||aṁti||)
neraga ne mīm̐damīm̐da nīgu valavam̐gam̐baṭṭi
araḍānam̐bĕṭṭidi nī vaulevayyā
ārīdi veruseyaga aṁḍagu ne rām̐baṭṭi
āriderĕm̐ banulĕllā naulevayyā
(||aṁti||)
yemīnanaga nīgĕ yichchagālāḍam̐gam̐baṭṭi
āmām̐ṭalāḍidivi aulevayyā
kāmiṁchi vŏgarivalĕ gayyāḽiṁchaguṁḍam̐baṭṭi
āmīm̐da nŏttugavachche vaulevayyā
(||aṁti||)
kādugūḍadanaga nīgai vaśhamugām̐baṭṭi
ādariṁchi kūḍidivi aulevayya
yīdĕsa śhrīveṁkaḍeśha yiḍu nannu mĕchcham̐baṭṭi
ādĕsa navvulu navve vaulevayya