Amtayanu ninnum bomdeyamdugorage

అంతయను నిన్నుఁ బొందేయందుకొరకే
Language

(॥పల్లవి॥)
అంతయను నిన్నుఁ బొందేయందుకొరకే
వింత సేసుక యిందుకు విసిగేవు సుమ్మీ

(॥అంత॥)
అంకెకు రానివేళ నాడుదు మే మైన నిన్ను
పొంకము వచ్చినవేళ పొగడుదుము
సంకె లేని మావంటి సతులకు నిది వోజ
పంకించి నీ విందు కెగ్గు పట్టేవు సుమ్మీ

(॥అంత॥)
బగి వాసి వున్న వేళ పగ చాటుదుము నిన్ను
మొగము చూచితేనె మొక్కుదుము
యెగసక్కేలె మావంటి యింతులకు సహజము
అగ డైతి నని నీవు అలిగేవు సుమ్మీ

(॥అంత॥)
తక్కించినప్పటివేళ తరిఁ జలపట్టుదము
గక్కనఁ గూడితేనె కరఁగుదుము
దక్కితి శ్రీవెంకటేశ తతి నలవేల్‌మంగను
వొక్క టైతి విది నాకు వొడఁబాటే సుమ్మీ

(||pallavi||)
aṁtayanu ninnum̐ bŏṁdeyaṁdugŏrage
viṁta sesuga yiṁdugu visigevu summī

(||aṁta||)
aṁkĕgu rāniveḽa nāḍudu me maina ninnu
pŏṁkamu vachchinaveḽa pŏgaḍudumu
saṁkĕ leni māvaṁṭi sadulagu nidi voja
paṁkiṁchi nī viṁdu kĕggu paṭṭevu summī

(||aṁta||)
bagi vāsi vunna veḽa paga sāḍudumu ninnu
mŏgamu sūsidenĕ mŏkkudumu
yĕgasakkelĕ māvaṁṭi yiṁtulagu sahajamu
aga ḍaidi nani nīvu aligevu summī

(||aṁta||)
takkiṁchinappaḍiveḽa tarim̐ jalabaṭṭudamu
gakkanam̐ gūḍidenĕ karam̐gudumu
dakkidi śhrīvĕṁkaḍeśha tadi nalavel‌maṁganu
vŏkka ṭaidi vidi nāgu vŏḍam̐bāḍe summī