అంతరంగములో నున్న హరియే గతిగాక
(॥పల్లవి॥)
అంతరంగములో నున్న హరియే గతిగాక
చింతించి మొక్కితేఁ దానే చేకొని రక్షించును
(॥అంత॥)
పుట్టించిన కర్మమే పోషించకుండునట
బెట్టుగా మనసే మఱపించునట
పట్టైన మేనే ఆసల బతిమాలింపించునట
చుట్టములెవ్వరు యెంచి చూచినఁ బ్రాణికిని
(॥అంత॥)
పక్కన విత్తినభూమి పంట వండకుండునట
యెక్కడా మాయే భ్రమయింపించునట
అక్కరతోఁ జేసిన పుణ్యమే కట్టివేసునట
దిక్కు దెస యెవ్వరు యీ దేహిఁ గరుణించను
(॥అంత॥)
ఆసలఁ బెట్టే పాయమే అటమటమౌనట
సేసే సంసారమే జ్ఞానిఁ జేయునట
వేసరక యింతకూ శ్రీవేంకటేశు డేలికట
వెూసపుచ్చేవారెవ్వరు ముదమే జీవునికి
(||pallavi||)
aṁtaraṁgamulo nunna hariye gadigāga
siṁtiṁchi mŏkkidem̐ dāne segŏni rakṣhiṁchunu
(||aṁta||)
puṭṭiṁchina karmame poṣhiṁchaguṁḍunaḍa
bĕṭṭugā manase maṟabiṁchunaḍa
paṭṭaina mene āsala badimāliṁpiṁchunaḍa
suṭṭamulĕvvaru yĕṁchi sūsinam̐ brāṇigini
(||aṁta||)
pakkana vittinabhūmi paṁṭa vaṁḍaguṁḍunaḍa
yĕkkaḍā māye bhramayiṁpiṁchunaḍa
akkaradom̐ jesina puṇyame kaṭṭivesunaḍa
dikku dĕsa yĕvvaru yī dehim̐ garuṇiṁchanu
(||aṁta||)
āsalam̐ bĕṭṭe pāyame aḍamaḍamaunaḍa
sese saṁsārame jñānim̐ jeyunaḍa
vesaraga yiṁtagū śhrīveṁkaḍeśhu ḍeligaḍa
vĕూsabuchchevārĕvvaru mudame jīvunigi