అంతరంగములో నున్న హరియే గతి గాక
(॥పల్లవి॥)
అంతరంగములో నున్న హరియే గతి గాక
చింతించి మొక్కితేఁ దానే చేకొని రక్షించును
(॥అంత॥)
పుట్టించిన కర్మమే పోషించకుండు నట
బెట్టుగా మనసే మరపించు నట
పట్టయిన దేహమే బతిమాలింపించు నట
చుట్టము లెవ్వరు యెంచి చూచినఁ బ్రాణికిని
(॥అంత॥)
పక్కన విత్తినభూమి పంట వండకుండు నట
యెక్కడా మాయే భ్రమయింపించు నట
అక్కరతోఁ జేసిన పుణ్యమే కట్టివేసు నట
దిక్కుదెస యెవ్వరు యీ దేహిఁ గరుణించను
(॥అంత॥)
ఆసలఁ బెట్టే పాయమే అటమట మౌనట
చేసే సంసార మజ్ఞానిఁ జేయు నట
వేసారక యింతకూ శ్రీవేంకటేశుఁ డేలికట
మోసపుచ్చే వారెవ్వరు ముదమే జీవునికి
(||pallavi||)
aṁtaraṁgamulo nunna hariye gadi gāga
siṁtiṁchi mŏkkidem̐ dāne segŏni rakṣhiṁchunu
(||aṁta||)
puṭṭiṁchina karmame poṣhiṁchaguṁḍu naḍa
bĕṭṭugā manase marabiṁchu naḍa
paṭṭayina dehame badimāliṁpiṁchu naḍa
suṭṭamu lĕvvaru yĕṁchi sūsinam̐ brāṇigini
(||aṁta||)
pakkana vittinabhūmi paṁṭa vaṁḍaguṁḍu naḍa
yĕkkaḍā māye bhramayiṁpiṁchu naḍa
akkaradom̐ jesina puṇyame kaṭṭivesu naḍa
dikkudĕsa yĕvvaru yī dehim̐ garuṇiṁchanu
(||aṁta||)
āsalam̐ bĕṭṭe pāyame aḍamaḍa maunaḍa
sese saṁsāra majñānim̐ jeyu naḍa
vesāraga yiṁtagū śhrīveṁkaḍeśhum̐ ḍeligaḍa
mosabuchche vārĕvvaru mudame jīvunigi