అంతరాత్మ హరి గలఁడంతే చాలు
(॥పల్లవి॥)
అంతరాత్మ హరి గలఁడంతే చాలు
యెంతకెంత చింతించనేలా వెఱవ
(॥అంత॥)
వెనక జన్మపు గతి వివరించి నే నెరగ
అనుగు మీఁదటి జన్మమది యెఱగ
ననిచి యీ జన్మము నానాఁట దెలిసేము
యెనసి యీ భవములకేలా వెఱవ
(॥అంత॥)
నిన్నటి దినము కత నిమిషమై తోఁచీని
కన్నుల రేపటి చేఁత కానఁగరాదు
పన్ని నేఁటి దినము మున్ను నోఁచినట్లే
యెన్నఁగ నెందుకునైనానేలావెఱవ
(॥అంత॥)
పరము నిహము నేఁ బైకొన నా యిచ్చగాదు
హరి శ్రీవేంకటపతి యఖిలకర్త
శరణంటి నాతనికి స్వతంత్ర మతనిది
యిరవైతి నింకా నాకేలా వెఱవ
(||pallavi||)
aṁtarātma hari galam̐ḍaṁte sālu
yĕṁtagĕṁta siṁtiṁchanelā vĕṟava
(||aṁta||)
vĕnaga janmabu gadi vivariṁchi ne nĕraga
anugu mīm̐daḍi janmamadi yĕṟaga
nanisi yī janmamu nānām̐ṭa dĕlisemu
yĕnasi yī bhavamulagelā vĕṟava
(||aṁta||)
ninnaḍi dinamu kada nimiṣhamai tom̐sīni
kannula rebaḍi sem̐ta kānam̐garādu
panni nem̐ṭi dinamu munnu nom̐sinaṭle
yĕnnam̐ga nĕṁdugunainānelāvĕṟava
(||aṁta||)
paramu nihamu nem̐ baigŏna nā yichchagādu
hari śhrīveṁkaḍabadi yakhilagarda
śharaṇaṁṭi nādanigi svadaṁtra madanidi
yiravaidi niṁkā nāgelā vĕṟava