అంతర మెఱుఁగవు ఆల నైతే నేమాయ
(॥పల్లవి॥)
అంతర మెఱుఁగవు ఆల నైతే నేమాయ
చెంతలఁ బనిగొనేవు చేకొలఁదిదాననా
(॥అంతర॥)
మగువకు నాచేత మాటలు చెప్పి పంపేవు
పగటున నిటు రాయబారినా నేను
మిగులా నాపెగుణాలు మెచ్చి బొగడు మనేవు
బగివాయక కొచ్చినబట్టుదాననా
(॥అంతర॥)
పొత్తుల నాకెతోనుండి పూఁచి వడ్డించు మనేవు
హత్తి మీకు నిద్దరికి నడబాలనా
చిత్తమురా నేఁ డీకెను సింగారించి తెమ్మనేవు
యిత్తల నీపెకుఁ జెలికత్తెనా నేను
(॥అంతర॥)
హరి నిద్దరికిని పచ్చడము గప్పుమనేవు
తరుణికి నూడిగెపుదాననా నేను
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
పరగ నే నేమైనా బైకొనరుదాననా
(||pallavi||)
aṁtara mĕṟum̐gavu āla naide nemāya
sĕṁtalam̐ banigŏnevu segŏlam̐didānanā
(||aṁtara||)
maguvagu nāseda māḍalu sĕppi paṁpevu
pagaḍuna niḍu rāyabārinā nenu
migulā nābĕguṇālu mĕchchi bŏgaḍu manevu
bagivāyaga kŏchchinabaṭṭudānanā
(||aṁtara||)
pŏttula nāgĕdonuṁḍi pūm̐si vaḍḍiṁchu manevu
hatti mīgu niddarigi naḍabālanā
sittamurā nem̐ ḍīgĕnu siṁgāriṁchi tĕmmanevu
yittala nībĕgum̐ jĕligattĕnā nenu
(||aṁtara||)
hari niddarigini pachchaḍamu gappumanevu
taruṇigi nūḍigĕbudānanā nenu
yiravai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
paraga ne nemainā baigŏnarudānanā