Amtara meramganivaaramte namdu kemaaya

అంతర మెరఁగనివారంటే నందు కేమాయ
Language

(॥పల్లవి॥)
అంతర మెరఁగనివారంటే నందు కేమాయ
యింతి సింగారాన కివి యీడు వచ్చీనా

(॥అంత॥)
కలువలవంటి వంటా కన్నులఁ బోల్తురు గాక
కలికి చూపులవలె గాడి పారీనా
తలకొన్నకొప్పు తుమ్మిదల యీడందురు గాక
చెలఁగి విభునిమతి జీఁకటై కప్పీనా

(॥అంత॥)
జక్కవ లీమెచన్నులచంద మనెంతురు గాక
చొక్కపుఁ గొండలవలెఁ జూపట్టీనా
చక్కఁగాఁ బిరుదు మరుచక్రముసరెంట గాక
యిక్కువ గడచి పతి కింపు వుట్టించీనా

(॥అంత॥)
పాదాలు తామరలంటా భావించుకొంట గాక
ఆదెన శ్రీవేంకటేశు ధ్యానింపించీనా
మేదిని నలమేల్మంగ మెరుఁగో యనుట గాక
పోదితో యీతనిఁ గూడి పొత్తుకు వచ్చీనా

(||pallavi||)
aṁtara mĕram̐ganivāraṁṭe naṁdu kemāya
yiṁti siṁgārāna kivi yīḍu vachchīnā

(||aṁta||)
kaluvalavaṁṭi vaṁṭā kannulam̐ bolduru gāga
kaligi sūbulavalĕ gāḍi pārīnā
talagŏnnagŏppu tummidala yīḍaṁduru gāga
sĕlam̐gi vibhunimadi jīm̐kaḍai kappīnā

(||aṁta||)
jakkava līmĕsannulasaṁda manĕṁturu gāga
sŏkkabum̐ gŏṁḍalavalĕm̐ jūbaṭṭīnā
sakkam̐gām̐ birudu marusakramusarĕṁṭa gāga
yikkuva gaḍasi padi kiṁpu vuṭṭiṁchīnā

(||aṁta||)
pādālu tāmaralaṁṭā bhāviṁchugŏṁṭa gāga
ādĕna śhrīveṁkaḍeśhu dhyāniṁpiṁchīnā
medini nalamelmaṁga mĕrum̐go yanuḍa gāga
podido yīdanim̐ gūḍi pŏttugu vachchīnā