(॥పల్లవి॥)
అంతలోనె తేరెనా ఆకె మనసు
పొంతనుండి యింకానేమి బుజ్జగించేవయ్యా
(॥॥)
సెలవి నవ్వులతోడ చెలియ మాటాడఁగాను
వెలయఁబూబంతిఁ గొని వేసితివి
నిలువుఁదురుము దాఁకె నిన్ను నాకె చూడఁగాను
చెలరేఁగి యేమిటికిఁ జెక్కు నొక్కేవయ్యా
(॥॥)
కొసరుఁజూపులతోడ కోమలి నీకు మొక్కఁగా
పొసఁగఁ బన్నీరు దిగఁబోసితివి
వెసఁ బయ్యద దడిసి వేడుక యానవెట్టఁగా
విసువక ఇప్పుడేమి విడెమిచ్చేవయ్యా
(॥॥)
సిగ్గులచేఁతలతోడ చెలి కాఁగిలించుకోఁగా
వొగ్గి గందవొడి చల్లి వొనరితివి
నిగ్గులశ్రీవేంకటేశ నిన్ను నాకె మెచ్చఁగాను
అగ్గమై యప్పటి నెంత ఆస సేసేవయ్యా
(||pallavi||)
aṁtalonĕ terĕnā āgĕ manasu
pŏṁtanuṁḍi yiṁkānemi bujjagiṁchevayyā
(||||)
sĕlavi navvuladoḍa sĕliya māḍāḍam̐gānu
vĕlayam̐būbaṁtim̐ gŏni vesidivi
niluvum̐durumu dām̐kĕ ninnu nāgĕ sūḍam̐gānu
sĕlarem̐gi yemiḍigim̐ jĕkku nŏkkevayyā
(||||)
kŏsarum̐jūbuladoḍa komali nīgu mŏkkam̐gā
pŏsam̐gam̐ bannīru digam̐bosidivi
vĕsam̐ bayyada daḍisi veḍuga yānavĕṭṭam̐gā
visuvaga ippuḍemi viḍĕmichchevayyā
(||||)
siggulasem̐taladoḍa sĕli kām̐giliṁchugom̐gā
vŏggi gaṁdavŏḍi salli vŏnaridivi
niggulaśhrīveṁkaḍeśha ninnu nāgĕ mĕchcham̐gānu
aggamai yappaḍi nĕṁta āsa sesevayyā