Amtalone navvunavve vaune neevu

అంతలోనే నవ్వునవ్వే వౌనే నీవు
Language

(॥పల్లవి॥)
అంతలోనే నవ్వునవ్వే వౌనే నీవు
అంతరంగమెల్ల నిండ ఆతఁడు గదే

(॥అంత॥)
చిన్నఁబోయి వుండినది చెలియ నీమోమిదేమే
చెన్నగునీవిభుఁడు విచ్చేయఁడాయనా
వెన్నెలలోపల నుండి వేసవియెండ లనేవు
అన్నమాటలోనే వచ్చె నాతఁడుగదే

(॥అంత॥)
నొసలెల్లాఁ జెమరించి నున్ననిచెక్కులఁ జారె
అసురుసురుగ నీతఁ డలయించెనా
పసురు మొగ్గలు చూచి పంచబాణము లనేవు
అసమునఁ జేయిచాఁచీ నాతఁడుగదే

(॥అంత॥)
కాయమెల్లఁ బులకించి కళలునిండె నిప్పుడు
యీయెడ శ్రీవేంకటేశుఁ డిట్టె కూడెనా
రేయిఁబగలాయనని రెట్టించె వలపనేవు
ఆయములిన్నీఁ దెలిపె నాతఁడుగదే

(||pallavi||)
aṁtalone navvunavve vaune nīvu
aṁtaraṁgamĕlla niṁḍa ādam̐ḍu gade

(||aṁta||)
sinnam̐boyi vuṁḍinadi sĕliya nīmomideme
sĕnnagunīvibhum̐ḍu vichcheyam̐ḍāyanā
vĕnnĕlalobala nuṁḍi vesaviyĕṁḍa lanevu
annamāḍalone vachchĕ nādam̐ḍugade

(||aṁta||)
nŏsalĕllām̐ jĕmariṁchi nunnanisĕkkulam̐ jārĕ
asurusuruga nīdam̐ ḍalayiṁchĕnā
pasuru mŏggalu sūsi paṁchabāṇamu lanevu
asamunam̐ jeyisām̐sī nādam̐ḍugade

(||aṁta||)
kāyamĕllam̐ bulagiṁchi kaḽaluniṁḍĕ nippuḍu
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ kūḍĕnā
reyim̐bagalāyanani rĕṭṭiṁchĕ valabanevu
āyamulinnīm̐ dĕlibĕ nādam̐ḍugade