అంతలో నితఁడు మగఁడాయనా నీకు
(॥పల్లవి॥)
అంతలో నితఁడు మగఁడాయనా నీకు
బంతికి వచ్చి నీవేల బాఁతిపడేవే
(॥అంత॥)
మాయింట నాతఁడు నేను మాటలాడుకొనఁగాను
నాయము లేమిచెప్పేవే నడుమ నీవు
చేయిచాఁచి నే నూరకె చెనకితినంటా నీవు
పూయక దూలవై యేల పూనకవచ్చేవే
(॥అంత॥)
చయ్యన నాతనిపై వసంతము నే జల్లఁగాను
పయ్యదఁ దుడువనేలే బత్తితో నీవు
వోయ్యనే పవ్వళించేటివోవరి కతఁడు రాఁగా
గయ్యాళితనాననేల కైలాగిచ్చేవే
(॥అంత॥)
నెట్టఁన బానుపుమీఁద నేనితఁడు నుండఁగాను
వొట్టుక నీవేల పాదాలోత్త వచ్చేవే
యిటెప శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
జట్టిగా నన్నేల నీవు సవతి వేలయ్యేవే
(||pallavi||)
aṁtalo nidam̐ḍu magam̐ḍāyanā nīgu
baṁtigi vachchi nīvela bām̐tibaḍeve
(||aṁta||)
māyiṁṭa nādam̐ḍu nenu māḍalāḍugŏnam̐gānu
nāyamu lemisĕppeve naḍuma nīvu
seyisām̐si ne nūragĕ sĕnagidinaṁṭā nīvu
pūyaga dūlavai yela pūnagavachcheve
(||aṁta||)
sayyana nādanibai vasaṁtamu ne jallam̐gānu
payyadam̐ duḍuvanele battido nīvu
voyyane pavvaḽiṁcheḍivovari kadam̐ḍu rām̐gā
gayyāḽidanānanela kailāgichcheve
(||aṁta||)
nĕṭṭam̐na bānubumīm̐da nenidam̐ḍu nuṁḍam̐gānu
vŏṭṭuga nīvela pādālotta vachcheve
yiḍĕba śhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
jaṭṭigā nannela nīvu savadi velayyeve