అంతకు నోపితేఁ జాలునందుకు నేఁ గాదనేనా
(॥పల్లవి॥)
అంతకు నోపితేఁ జాలునందుకు నేఁ గాదనేనా
చెంతలనే వూరకున్నఁ జిమ్మిరేఁగుఁ బనులు
(॥అంతకు॥)
వొడివట్టి తీసేవు వూరకే యానవెట్టేవు
అడరి నీయింటికి రమ్మనుచు నీవు
వడిగానాడనున్న వారు వాదులడిచితే
గొడవ మానుపలేవు కొద్దిమీరుఁ బనులు
(॥అంతకు॥)
చెక్కు గడు నొక్కేవు చేతులెత్తి మొక్కేవు
అక్కరఁబొత్తు బోసేతమనుచు నీవు
కక్కసించి నీసతులు కైదప్పు సేయవచ్చితే
చిక్కక నేనే ముందు చేముంతునపుడు
(॥అంతకు॥)
కన్నులారిచేవు నాకు కాఁగిట బిగించేవు
అన్నిటా నన్ను మన్నించేననుచు నీవు
నన్ను నీవు గూడితివి నగుతా శ్రీవేంకటేశ
మిన్నక నీసతులను మెట్టి యెలఁబడును
(||pallavi||)
aṁtagu nobidem̐ jālunaṁdugu nem̐ gādanenā
sĕṁtalane vūragunnam̐ jimmirem̐gum̐ banulu
(||aṁtagu||)
vŏḍivaṭṭi tīsevu vūrage yānavĕṭṭevu
aḍari nīyiṁṭigi rammanusu nīvu
vaḍigānāḍanunna vāru vādulaḍiside
gŏḍava mānubalevu kŏddimīrum̐ banulu
(||aṁtagu||)
sĕkku gaḍu nŏkkevu sedulĕtti mŏkkevu
akkaram̐bŏttu bosedamanusu nīvu
kakkasiṁchi nīsadulu kaidappu seyavachchide
sikkaga nene muṁdu semuṁtunabuḍu
(||aṁtagu||)
kannulārisevu nāgu kām̐giḍa bigiṁchevu
anniḍā nannu manniṁchenanusu nīvu
nannu nīvu gūḍidivi nagudā śhrīveṁkaḍeśha
minnaga nīsadulanu mĕṭṭi yĕlam̐baḍunu