Amtadigi nidavari aabe galigidem jaalu

అంతటికి నితవరి ఆపె గలిగితేఁ జాలు
Language

(॥పల్లవి॥)
అంతటికి నితవరి ఆపె గలిగితేఁ జాలు
సంతసాన నే నుండే చాలు మమ్ము నంపరా

(॥అంత॥)
మచ్చిక నాతో నీవు మాట లాడఁగాఁ గదా
కొచ్చి కొచ్చి యాపె నిన్నుఁ గోపగించెను
రచ్చల నేను నీతో రాయడించ దొరకొంటే
వొచ్చము నీపై వుండ వొద్దు మమ్ము నంపరా

(॥అంత॥)
యిన్నేసి నీవు నాకు నిచ్చకాలు సేయఁగాఁ గా
సన్నల చాయల నాపె జంకించెను
యిన్నిటా నేను నీతో యెగసక్కేలు సేసితే
యెన్నినట్టే రాదు మమ్ము నింటిలోని కంపరా

(॥అంత॥)
కందువ నాకు మోహించి కాఁగిటఁ గూడఁగఁ గదా
అందాలు సేసుక నిన్ను నాపె మెచ్చెను
యిందుకే శ్రీవేంకటేశ యిద్దర మొక్కటైతిమి
విందు చెప్పితి నాపెను విడిదికి నంపరా

(||pallavi||)
aṁtaḍigi nidavari ābĕ galigidem̐ jālu
saṁtasāna ne nuṁḍe sālu mammu naṁparā

(||aṁta||)
machchiga nādo nīvu māḍa lāḍam̐gām̐ gadā
kŏchchi kŏchchi yābĕ ninnum̐ gobagiṁchĕnu
rachchala nenu nīdo rāyaḍiṁcha dŏragŏṁṭe
vŏchchamu nībai vuṁḍa vŏddu mammu naṁparā

(||aṁta||)
yinnesi nīvu nāgu nichchagālu seyam̐gām̐ gā
sannala sāyala nābĕ jaṁkiṁchĕnu
yinniḍā nenu nīdo yĕgasakkelu seside
yĕnninaṭṭe rādu mammu niṁṭiloni kaṁparā

(||aṁta||)
kaṁduva nāgu mohiṁchi kām̐giḍam̐ gūḍam̐gam̐ gadā
aṁdālu sesuga ninnu nābĕ mĕchchĕnu
yiṁduge śhrīveṁkaḍeśha yiddara mŏkkaḍaidimi
viṁdu sĕppidi nābĕnu viḍidigi naṁparā