అంతటిది గాకుండితే అది ని న్నిందరిలోన
(॥పల్లవి॥)
అంతటిది గాకుండితే అది ని న్నిందరిలోన
నింతకు దెచ్చెను చాలు నిందుకే మెచ్చితిని
(॥అంత॥)
సమ్మాళిగెలు మెట్టి సతి రాజసముతోడ
కమ్మి యొకచెలిమీదఁ గరము చాఁచి
తమ్మిమోము విచ్చి నీతో తలవాకిటనే వుండి
యెమ్మెలకే మాటలాడి యేమనేరా నిన్నును
(॥అంత॥)
పుక్కిటివీడెముతోడ బోలుఁ గొప్పువెడ జార
వొక్కింత వజ్రాలకమ్మ లొగిఁ గదల
పక్కన నీడకు రాఁగా బారితెంచి చేచేత
జిక్కించి లోన నేరీతిఁ జొక్కించెరా నిన్నును
(॥అంత॥)
చిగురుఁబెదవి మోపి శ్రీవేంకటేశ నిన్ను
మొగపుల మొలనూలు మోఁ బంచెను
బిగువు గౌఁగిటఁ గూడి పిప్పి సేసె నీ మేను
యెగసక్కాలకు నేఁడు యెవ్వతెరా నిన్నును
(||pallavi||)
aṁtaḍidi gāguṁḍide adi ni nniṁdarilona
niṁtagu dĕchchĕnu sālu niṁduge mĕchchidini
(||aṁta||)
sammāḽigĕlu mĕṭṭi sadi rājasamudoḍa
kammi yŏgasĕlimīdam̐ garamu sām̐si
tammimomu vichchi nīdo talavāgiḍane vuṁḍi
yĕmmĕlage māḍalāḍi yemanerā ninnunu
(||aṁta||)
pukkiḍivīḍĕmudoḍa bolum̐ gŏppuvĕḍa jāra
vŏkkiṁta vajrālagamma lŏgim̐ gadala
pakkana nīḍagu rām̐gā bāridĕṁchi seseda
jikkiṁchi lona nerīdim̐ jŏkkiṁchĕrā ninnunu
(||aṁta||)
sigurum̐bĕdavi mobi śhrīveṁkaḍeśha ninnu
mŏgabula mŏlanūlu mom̐ baṁchĕnu
biguvu gaum̐giḍam̐ gūḍi pippi sesĕ nī menu
yĕgasakkālagu nem̐ḍu yĕvvadĕrā ninnunu