అంతటఁ గాని తీరదు ఆపెనే చేరి
(॥పల్లవి॥)
అంతటఁ గాని తీరదు ఆపెనే చేరి
చెంత లోనికి రమ్మని చే వట్టి తియ్యవయ్యా
(॥అంతట॥)
యిచ్చగించి నీవు నాపె యేకతము లాడఁ గాను
వచ్చి వచ్చి నిలిచెను వాకటిఁ జెలి
తుచ్చము లాడక తొల్లె తొయ్యలిచే మొక్కించి
మచ్చికగాఁ గిందుపడి మాట లాడవయ్యా
(॥అంతట॥)
చేచేతమీ రిద్దరును సెలవుల నవ్వఁ గాను
చూచి చూచి తలవంచి సోలగిలీని
యేచి కోపించకతొల్లె యింతిచే సేవ సేయించి
తాచి నీకాఁగిట నీవు తమి రేఁచవయ్యా
(॥అంతట॥)
మంచముపై నీవు నాపె మలయఁగా ముట్టి ముట్టి
అంచునఁ దా బవ్వళించి అంగవించును
అంచెల శ్రీవెంకటేశ అంతలోఁ గూడితి వాపె
కంచముపొత్తు గలపి కరగించవయ్యా
(||pallavi||)
aṁtaḍam̐ gāni tīradu ābĕne seri
sĕṁta lonigi rammani se vaṭṭi tiyyavayyā
(||aṁtaḍa||)
yichchagiṁchi nīvu nābĕ yegadamu lāḍam̐ gānu
vachchi vachchi nilisĕnu vāgaḍim̐ jĕli
tuchchamu lāḍaga tŏllĕ tŏyyalise mŏkkiṁchi
machchigagām̐ giṁdubaḍi māḍa lāḍavayyā
(||aṁtaḍa||)
sesedamī riddarunu sĕlavula navvam̐ gānu
sūsi sūsi talavaṁchi solagilīni
yesi kobiṁchagadŏllĕ yiṁtise seva seyiṁchi
tāsi nīgām̐giḍa nīvu tami rem̐savayyā
(||aṁtaḍa||)
maṁchamubai nīvu nābĕ malayam̐gā muṭṭi muṭṭi
aṁchunam̐ dā bavvaḽiṁchi aṁgaviṁchunu
aṁchĕla śhrīvĕṁkaḍeśha aṁtalom̐ gūḍidi vābĕ
kaṁchamubŏttu galabi karagiṁchavayyā