అంతటఁ గాని తీర దతివ మతి కోపము
(॥పల్లవి॥)
అంతటఁ గాని తీర దతివ మతి కోపము
యెంత దలపోసినా యిదివో నాయకుఁడా
(॥అంతట॥)
యిప్పుడైనా నామాట కియ్యకొంటేఁ జాలుఁ గాక
తప్పి పోయినా వలపు తతి మీరీనా
చెప్పనా నీ కప్పుడే సేసిననేరాన కెల్ల
ముప్పిరి నాపె నీపెకు మొక్కించు మని
(॥అంతట॥)
వెనకటి నీచలము విడిచితేఁ జాలుఁ గాక
అనువుగఁ జేయ లేమా అన్నిపనులు
విన వైతి వింతే కాక వేగమే యెచ్చరించనా
చెనకిన ఆపె నీపెచేతి కిమ్మని
(॥అంతట॥)
ప్రేమానఁ దగవు నడుపే నంటేఁ జాలుఁ గాక
యీమగువమారుగ నే నియ్యకొననా
కామించి శ్రీవెంకటేశ కలసితి వౌ నననా
సామాన నాపె నీపెను సరిగాఁ జేయు మని
(||pallavi||)
aṁtaḍam̐ gāni tīra dadiva madi kobamu
yĕṁta dalabosinā yidivo nāyagum̐ḍā
(||aṁtaḍa||)
yippuḍainā nāmāḍa kiyyagŏṁṭem̐ jālum̐ gāga
tappi poyinā valabu tadi mīrīnā
sĕppanā nī kappuḍe sesinanerāna kĕlla
muppiri nābĕ nībĕgu mŏkkiṁchu mani
(||aṁtaḍa||)
vĕnagaḍi nīsalamu viḍisidem̐ jālum̐ gāga
anuvugam̐ jeya lemā annibanulu
vina vaidi viṁte kāga vegame yĕchchariṁchanā
sĕnagina ābĕ nībĕsedi kimmani
(||aṁtaḍa||)
premānam̐ dagavu naḍube naṁṭem̐ jālum̐ gāga
yīmaguvamāruga ne niyyagŏnanā
kāmiṁchi śhrīvĕṁkaḍeśha kalasidi vau nananā
sāmāna nābĕ nībĕnu sarigām̐ jeyu mani