అంతటఁ దనవుడుకారును అయినట్టయ్యీఁ బంతము
(॥పల్లవి॥)
అంతటఁ దనవుడుకారును అయినట్టయ్యీఁ బంతము
చెంతల నా విన్నపమిది చేకొనుమనఁగదవే
(॥అంత॥)
పొందులుసేసేదెల్లా పోరాటముకొరకేనా
యిందుకునేమీననఁ దను నింటికి రమ్మనవే
కొందరు సతులను జూపుచు కోపము రేఁచఁగనప్పుడు
ముందుగనేమని యంటినొ మొక్కితి నేననవే
(॥అంత॥)
యెనయుచు నవ్వినదెల్లా యెగ్గులు పట్టుటకేనా
వెనకటివిఁకఁ దడపేనా వీడెము గొమ్మనవే
వనితలయిండ్ల వాకిట వడిఁ దా రచ్చలుసేయఁగ
మొనగోరటు సోఁకించితి మొక్కితి నేననవే
(॥అంత॥)
సొలసిన కౌఁగిటి రతులివి సూడులు వట్టుటకేనా
అలమేల్మంగను నేనే అలను తనకనవే
యెలమిని శ్రీ వేంకటేశుఁడుయెవ్వతె సుద్దులొ తలచఁగ
మొలనూలునఁ దనువేసితి మొక్కితి నేననవే
(||pallavi||)
aṁtaḍam̐ danavuḍugārunu ayinaṭṭayyīm̐ baṁtamu
sĕṁtala nā vinnabamidi segŏnumanam̐gadave
(||aṁta||)
pŏṁdulusesedĕllā porāḍamugŏragenā
yiṁdugunemīnanam̐ danu niṁṭigi rammanave
kŏṁdaru sadulanu jūbusu kobamu rem̐sam̐ganappuḍu
muṁduganemani yaṁṭinŏ mŏkkidi nenanave
(||aṁta||)
yĕnayusu navvinadĕllā yĕggulu paṭṭuḍagenā
vĕnagaḍivim̐kam̐ daḍabenā vīḍĕmu gŏmmanave
vanidalayiṁḍla vāgiḍa vaḍim̐ dā rachchaluseyam̐ga
mŏnagoraḍu som̐kiṁchidi mŏkkidi nenanave
(||aṁta||)
sŏlasina kaum̐giḍi radulivi sūḍulu vaṭṭuḍagenā
alamelmaṁganu nene alanu tanaganave
yĕlamini śhrī veṁkaḍeśhum̐ḍuyĕvvadĕ suddulŏ talasam̐ga
mŏlanūlunam̐ danuvesidi mŏkkidi nenanave