Amtada naajanmaphala mappuda gaadaa

అంతట నాజన్మఫల మబ్పుట గాదా
Language

(॥పల్లవి॥)
అంతట నాజన్మఫల మబ్పుట గాదా
చెంతల నిన్నియు నీకే సెలవుగాదా

(॥అంతట॥)
మఱి పొరుగున నున్నతఱి నొక్క మాటైనా
నెఱవుగా నీవు నన్ను నిక్కి చూడవా
గుఱిగా దినమూ నీకొలువుకు రాఁగాను
మఱచి తప్పియైనాను మాటాడవా

(॥అంతట॥)
చెలితో నావిరహము చెప్పి చెప్పి పుత్తేఁ గా
అలరి యేపాటైనా నాలకించనా
నెలకొని యిందరితో నీవార మను కోఁగా
తలఁచి నీవే నన్ను దయ జూడవా

(॥అంతట॥)
చెక్కుచేయి దీసి నీకు సిగ్గువాసి మొక్క గాన
గక్కన నట్టే నీవు కౌఁగిలించవా
యిక్కు వంటి శ్రీవేంకటేశ యిట్టె కూడితివి
మిక్కిలి యింతట నన్ను మెఱయించవా

(||pallavi||)
aṁtaḍa nājanmaphala mappuḍa gādā
sĕṁtala ninniyu nīge sĕlavugādā

(||aṁtaḍa||)
maṟi pŏruguna nunnadaṟi nŏkka māḍainā
nĕṟavugā nīvu nannu nikki sūḍavā
guṟigā dinamū nīgŏluvugu rām̐gānu
maṟasi tappiyainānu māḍāḍavā

(||aṁtaḍa||)
sĕlido nāvirahamu sĕppi sĕppi puttem̐ gā
alari yebāḍainā nālagiṁchanā
nĕlagŏni yiṁdarido nīvāra manu kom̐gā
talam̐si nīve nannu daya jūḍavā

(||aṁtaḍa||)
sĕkkuseyi dīsi nīgu sigguvāsi mŏkka gāna
gakkana naṭṭe nīvu kaum̐giliṁchavā
yikku vaṁṭi śhrīveṁkaḍeśha yiṭṭĕ kūḍidivi
mikkili yiṁtaḍa nannu mĕṟayiṁchavā