అంత యేల వొరసేవు అప్పటి నన్ను
(॥పల్లవి॥)
అంత యేల వొరసేవు అప్పటి నన్ను
కాంతలకు నీమోవి గాడిపట్టుగాదా
(॥అంత॥)
నలసెల్లా నాదెకాక వాసులెంచిచూచితేను
పలువురనేలేనీకుఁ బాటి వున్నదా
బలిమిసేసి నాచేతఁ బడితలింపించితేను
వెలలేనినీ కాఁగిలి విడిదిల్లుగాదా
(॥అంత॥)
సిగ్గెల్లా నాదెకాక చేరి యెరుకపరచితే
వొగ్గినయాసలనీకు వోజ వున్నదా
అగ్గలమై నీవు గడునంత నన్ను రెఁచితేను
తగ్గనినీమే నన్నిటా దాయిమానుగాదా
(॥అంత॥)
పంతమెల్లా నాదెకాక భావించి చూచితేను
యింతులకు మొక్కేనీకు యెమ్మెవున్నదా
ఇంతటి శ్రీవేంకటేశ ఇట్టె నన్నుఁ గూడితివి
పొంతలనే శిరసిది బొడ్రాయి గాదా
(||pallavi||)
aṁta yela vŏrasevu appaḍi nannu
kāṁtalagu nīmovi gāḍibaṭṭugādā
(||aṁta||)
nalasĕllā nādĕgāga vāsulĕṁchisūsidenu
paluvuranelenīgum̐ bāḍi vunnadā
balimisesi nāsedam̐ baḍidaliṁpiṁchidenu
vĕlaleninī kām̐gili viḍidillugādā
(||aṁta||)
siggĕllā nādĕgāga seri yĕrugabaraside
vŏgginayāsalanīgu voja vunnadā
aggalamai nīvu gaḍunaṁta nannu rĕm̐sidenu
tagganinīme nanniḍā dāyimānugādā
(||aṁta||)
paṁtamĕllā nādĕgāga bhāviṁchi sūsidenu
yiṁtulagu mŏkkenīgu yĕmmĕvunnadā
iṁtaḍi śhrīveṁkaḍeśha iṭṭĕ nannum̐ gūḍidivi
pŏṁtalane śhirasidi bŏḍrāyi gādā