Amta vichchi seppagu maa kappadi neevu

అంత విచ్చి చెప్పకు మా కప్పటి నీవు
Language

(॥పల్లవి॥)
అంత విచ్చి చెప్పకు మా కప్పటి నీవు
యింతా నీ మన్ననలోనె యెఱఁగరాదా

(॥అంత॥)
వీనులకు నేఁజేసేవిన్నపము చవులైతే
నావినాని నీవలపు ననలొత్తీని
ఆనందించి నీకు నాపై నంతబత్తి గలిగితే
కానరాదా నీమోము కళలలోనె

(॥అంత॥)
సోగలుగా నేఁజూచేచూపులే నీకితవైతే
చేఁగదేరేనీమనసు చిగిరించీని
వేగిరించి నన్నుఁ బొందేవేడుక నీకుఁ గలితే
లాగుగాఁ దెలియదా సెలవినవ్వులోనె

(॥అంత॥)
చెనకేనాసరసము చిత్తాన నీకుఁ బట్టితే
పనివడి నీకోరిక ఫలియించీని
యెనయుచు శ్రీవేంకటేశ నన్ను నేలితివి
ననుపెల్లాఁ దోఁచగా యీనయములోనె

(||pallavi||)
aṁta vichchi sĕppagu mā kappaḍi nīvu
yiṁtā nī mannanalonĕ yĕṟam̐garādā

(||aṁta||)
vīnulagu nem̐jesevinnabamu savulaide
nāvināni nīvalabu nanalŏttīni
ānaṁdiṁchi nīgu nābai naṁtabatti galigide
kānarādā nīmomu kaḽalalonĕ

(||aṁta||)
sogalugā nem̐jūsesūbule nīgidavaide
sem̐gaderenīmanasu sigiriṁchīni
vegiriṁchi nannum̐ bŏṁdeveḍuga nīgum̐ galide
lāgugām̐ dĕliyadā sĕlavinavvulonĕ

(||aṁta||)
sĕnagenāsarasamu sittāna nīgum̐ baṭṭide
panivaḍi nīgoriga phaliyiṁchīni
yĕnayusu śhrīveṁkaḍeśha nannu nelidivi
nanubĕllām̐ dom̐sagā yīnayamulonĕ