Amta vellivirigaa naadimturaa yee

అంత వెల్లివిరిగా నాడింతురా యీ
Language

(॥పల్లవి॥)
అంత వెల్లివిరిగా నాడింతురా యీ
మంతనపు విభుఁడనీ మాటలు మానేవా

(॥అంత॥)
మింటిమీఁదిచందురునిమేని కందింతురు గాక
కంటిలోనినలుపులు కానఁ బొయ్యేరా
గొంటరివై నా మదిలో కోపమే యెంచేవు గాక
దంట నీ చేఁతలలోనితప్పు లెంచేవా

(॥అంత॥)
వాలిన చెఱకువింటివంకలే యెంచేవు గాక
నాలుకలో మలక లెన్నఁగ బోయేవా
వాలాయించి నీవు నా వాదులే యెంచేవు గాక
యీలాగు నీ గుణము లింక మానేవా

(॥అంత॥)
మరిగి యడవితేనె మధుర మెంతురు గాక
సరి మోవితేనెతీపుసాటి వచ్చునా
యిరవైన శ్రీవేంకటేశ నీ కౌఁగిట నన్ను
నిరతి న న్నేలితివి నీవు మఱచేవా

(||pallavi||)
aṁta vĕllivirigā nāḍiṁturā yī
maṁtanabu vibhum̐ḍanī māḍalu mānevā

(||aṁta||)
miṁṭimīm̐disaṁdurunimeni kaṁdiṁturu gāga
kaṁṭiloninalubulu kānam̐ bŏyyerā
gŏṁṭarivai nā madilo kobame yĕṁchevu gāga
daṁṭa nī sem̐talalonidappu lĕṁchevā

(||aṁta||)
vālina sĕṟaguviṁṭivaṁkale yĕṁchevu gāga
nālugalo malaga lĕnnam̐ga boyevā
vālāyiṁchi nīvu nā vādule yĕṁchevu gāga
yīlāgu nī guṇamu liṁka mānevā

(||aṁta||)
marigi yaḍavidenĕ madhura mĕṁturu gāga
sari movidenĕdībusāḍi vachchunā
yiravaina śhrīveṁkaḍeśha nī kaum̐giḍa nannu
niradi na nnelidivi nīvu maṟasevā