Amta suttamulaa neegu navi yellaanu

అంత చుట్టములా నీకు నవి యెల్లాను
Language

(॥పల్లవి॥)
అంత చుట్టములా నీకు నవి యెల్లాను
సంతసమే కాక నీకు జాలిమాలి యేలే

(॥అంత॥)
ఆకసపుచందురుఁడు అఱచేతిలోనఁ జిక్కె
చేకొని రమణి యింకాఁ జింత యేలే
దాకొన్న తుమ్మిదలును తన్నుఁ దానె వెడ జారె
నీ కేల చిన్నఁబోను నెలతరో నేఁడు

(॥అంత॥)
ముంచినట్టి చల్లగాలి ముక్కుననే వెళ్లఁ జొచ్చె
వంచిన శిరసుతోడ వాఁడ నేటికి
పంచశరునియమ్ములు పక్కనఁ గన్నులు మలసె
యెంచరాని యలపులు యిపు డేలే నీకు

(॥అంత॥)
నిరతిఁ జిలుకపల్కు నీ మోనమునఁ జిక్కె
పరగ నివ్వెఱగులు సై నేలే
గరిమ శ్రీవేంకటేశుఁ గలసితి విదివో
అరిది యలమేల్మంగ వన్నియుఁ జేకూడెనే

(||pallavi||)
aṁta suṭṭamulā nīgu navi yĕllānu
saṁtasame kāga nīgu jālimāli yele

(||aṁta||)
āgasabusaṁdurum̐ḍu aṟasedilonam̐ jikkĕ
segŏni ramaṇi yiṁkām̐ jiṁta yele
dāgŏnna tummidalunu tannum̐ dānĕ vĕḍa jārĕ
nī kela sinnam̐bonu nĕladaro nem̐ḍu

(||aṁta||)
muṁchinaṭṭi sallagāli mukkunane vĕḽlam̐ jŏchchĕ
vaṁchina śhirasudoḍa vām̐ḍa neḍigi
paṁchaśharuniyammulu pakkanam̐ gannulu malasĕ
yĕṁcharāni yalabulu yibu ḍele nīgu

(||aṁta||)
niradim̐ jilugabalgu nī monamunam̐ jikkĕ
paraga nivvĕṟagulu sai nele
garima śhrīveṁkaḍeśhum̐ galasidi vidivo
aridi yalamelmaṁga vanniyum̐ jegūḍĕne