అంత సేసినవాఁడవు పంత మీవయ్య
(॥పల్లవి॥)
అంత సేసినవాఁడవు పంత మీవయ్య
చెంతల నీకుఁ బ్రియము చెప్ప దిదివో
(॥అంత॥)
చెక్కులు నొక్కిననొక్కు చిత్తమెల్లఁ బులకించి
మక్కువకామిని నీతో మాట లాడదు
అక్కడ నవ్విననవ్వు ఆయ మెల్లఁ గాఁడి పారి
చొక్కుచు నిన్నుఁ దప్పక చూడ దిదివో
(॥అంత॥)
సరస మాడినచేఁత సందుసందులనుఁ జిక్కి
వొరయుదు చన్నుల ని న్నూరికె చెలి
యిరవుగాఁ జూచినచూ పెదలోనఁ బాయదు
తెరమరఁ గెంతైన దియ్య దిదివో
(॥అంత॥)
బిగియించిన కాఁగిట ప్రియముల తల కెక్కి
వెగటుసంతోసముల విఱ్ఱవీఁగీని
నిగిడి శ్రీవెంకటేశ నీ వింతలోఁ గూడఁగాను
తగిలిన రతులకె తమకించీ నిదివో
(||pallavi||)
aṁta sesinavām̐ḍavu paṁta mīvayya
sĕṁtala nīgum̐ briyamu sĕppa didivo
(||aṁta||)
sĕkkulu nŏkkinanŏkku sittamĕllam̐ bulagiṁchi
makkuvagāmini nīdo māḍa lāḍadu
akkaḍa navvinanavvu āya mĕllam̐ gām̐ḍi pāri
sŏkkusu ninnum̐ dappaga sūḍa didivo
(||aṁta||)
sarasa māḍinasem̐ta saṁdusaṁdulanum̐ jikki
vŏrayudu sannula ni nnūrigĕ sĕli
yiravugām̐ jūsinasū pĕdalonam̐ bāyadu
tĕramaram̐ gĕṁtaina diyya didivo
(||aṁta||)
bigiyiṁchina kām̐giḍa priyamula tala kĕkki
vĕgaḍusaṁtosamula viṭravīm̐gīni
nigiḍi śhrīvĕṁkaḍeśha nī viṁtalom̐ gūḍam̐gānu
tagilina radulagĕ tamagiṁchī nidivo