Amta sesinattimeemda imtaseside nemaaya

అంత సేసినట్టిమీఁద ఇంతసేసితే నేమాయ
Language

(॥పల్లవి॥)
అంత సేసినట్టిమీఁద ఇంతసేసితే నేమాయ
దొంతినున్న వలపులు దోమటికి రావా

(॥అంత॥)
తీపున నిందాఁకా నిన్నుఁ దిట్లు దిట్టిననోరు
చేపట్టి నీకుఁ బ్రియాలు చెప్పఁగలేదా
దాపలాన నీమీఁదఁ జాఁచి పెనఁగినచేయి
మోపుచు నొసల నీకు మొక్కనోపదా

(॥అంత॥)
అలుకలకు గురియై అవ్వలి మోమైనమోము
పెలుచుమోపువు విందు పెట్టఁగ లేదా
మొలకపాయములను మొనచూపినచన్నులు
గిలిగింతరతులను కిందుపడనోపవా

(॥అంత॥)
సారాసారెసణఁగుల జంకించనట్టికన్నులు
నారుకొన్న వేడుకల నవ్వఁదగదా
యీరీతి శ్రీవేంకటేశ యింతి నీవురము యెక్కె
నుపులరతులను నిన్నిట్టె మెప్పించదా

(||pallavi||)
aṁta sesinaṭṭimīm̐da iṁtaseside nemāya
dŏṁtinunna valabulu domaḍigi rāvā

(||aṁta||)
tībuna niṁdām̐kā ninnum̐ diṭlu diṭṭinanoru
sebaṭṭi nīgum̐ briyālu sĕppam̐galedā
dābalāna nīmīm̐dam̐ jām̐si pĕnam̐ginaseyi
mobusu nŏsala nīgu mŏkkanobadā

(||aṁta||)
alugalagu guriyai avvali momainamomu
pĕlusumobuvu viṁdu pĕṭṭam̐ga ledā
mŏlagabāyamulanu mŏnasūbinasannulu
giligiṁtaradulanu kiṁdubaḍanobavā

(||aṁta||)
sārāsārĕsaṇam̐gula jaṁkiṁchanaṭṭigannulu
nārugŏnna veḍugala navvam̐dagadā
yīrīdi śhrīveṁkaḍeśha yiṁti nīvuramu yĕkkĕ
nubularadulanu ninniṭṭĕ mĕppiṁchadā